Begin typing your search above and press return to search.

అవి చెత్త సీన్స్‌ అని ముందే అనిపించింది

ఆ సినిమా చిత్రీకరణ సమయం లోనే కొన్ని సన్నివేశాలు చెత్తగా ఉన్నాయి అనిపించింది.

By:  Tupaki Desk   |   31 July 2023 8:36 AM GMT
అవి చెత్త సీన్స్‌ అని ముందే అనిపించింది
X

మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా ఈ అమ్మడు మెగాస్టార్‌.. సూపర్ స్టార్స్ వంటి స్టార్ హీరోల తో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది అంటే ఈ అమ్మడి స్టార్ డమ్‌.. సత్తా ఏ స్థాయి లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజినీకాంత్ తో కలిసి నటించిన జైలర్ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఈ అమ్మడు పాల్గొంటుంది.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అత్యంత నిరాశ ను మిగిల్చిన సినిమా గురించి మాట్లాడింది. సూపర్‌ స్టార్‌ విజయ్‌ తో నటించే అవకాశం రావడం గొప్ప విషయం. అలాంటిది తమన్నా కు విజయ్ తో 'సుర' సినిమా లో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంది.

ఆ సినిమా చిత్రీకరణ సమయం లోనే కొన్ని సన్నివేశాలు చెత్తగా ఉన్నాయి అనిపించింది. కానీ ఒక సినిమా కు కమిట్ అయ్యాక మనము ఏం చేయలేం. చేసుకుంటూ వెళ్లాల్సిందే. సుర సినిమా లో ఆ సన్నివేశాల్లో నా నటన కూడా అస్సలు బాగోలేదు అనే విషయం నాకు కూడా తెలుసు అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

సుర సినిమా లోని పాటలు మాత్రం ఇప్పటికి కూడా చాలా మందిని అలరిస్తూనే ఉన్నాయి. నేను కూడా అప్పుడప్పుడు ఆ పాటల ను వింటూనే ఉంటాను అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. మొత్తానికి కెరీర్‌ లో చాలా నిరాశ ను కలిగించిన సినిమా గా సుర ఎప్పటికి నిలుస్తుందని తమన్నా పేర్కొంది.

జైలర్ సినిమా లో రజినీకాంత్ కు జోడీ గా నటించిన ఈ అమ్మడు భోళా శంకర్‌ సినిమా లో చిరంజీవికి జోడీ గా నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఈ అమ్మడి కెరీర్ ఈ రెండు సినిమాల ఫలితం పై ఆధారపడి ఉంటుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.