Begin typing your search above and press return to search.

మ్యూజిక్ గోల.. రజనీ అలా.. తమన్ ఇలా..

అయితే రీసెంట్​గా మ్యూజిక్​ విషయంలో టాలీవుడ్​ మ్యూజిక్ డైరెక్టర్​ తమన్ అన్న కామెంట్స్ వైరల్​గా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Oct 2023 6:55 AM GMT
మ్యూజిక్ గోల.. రజనీ అలా.. తమన్ ఇలా..
X

ఓ సినిమా విజయంలో మ్యూజిక్​ కూడా ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సీన్​ను సందర్భానికి తగట్టుగా ప్రేక్షకుడికి మరింత దగ్గర చేసి ఆకట్టుకుంటుంది. కొన్నిసార్లు కంటెంట్​ స్థాయిని కూడా మరింత బలంగా చూపిస్తుంది. రీసెంట్​గా వచ్చిన విక్రమ్​, జైలర్, లియో చిత్రాలే నిదర్శనం.

అయితే రీసెంట్​గా మ్యూజిక్​ విషయంలో టాలీవుడ్​ మ్యూజిక్ డైరెక్టర్​ తమన్ అన్న కామెంట్స్ వైరల్​గా మారిన సంగతి తెలిసిందే. "అక్కడ చచ్చిన శవాన్ని తీసుకొస్తే నేనేమ్​ చేస్తా. ఎవరూ ఏమీ చేయలేరు. మూవీ డైరెక్టరే సరైన కంటెంట్ ఇవ్వాలి" అంటూ అన్నారు. దీంతో ఆ మధ్య జైలర్ సినిమా సక్సెస్​లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్​ మరోసారి తెరపైకి వచ్చాయి.

రజనీ మాట్లాడుతూ.. అనిరూధ్ రవిచందర్ బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ వల్లే జైలర్​ సినిమా మరింత స్థాయికి వెళ్లి బ్లాక్ బస్టర్​హిట్​గా నిలిచింది అన్నారు. తమన్ ఏమో.. దర్శకుడు సినిమాలోని సీన్స్​ను, కథలో ఎమోషన్స్​ను​ చక్కగా చూపించినప్పుడే మంచి సంగీతం అందించగలమని తమన్ అన్నారు. కథలో ఎమోషన్స్ సన్నివేశాలు సరిగ్గా లేకపోతే.. సంగీత దర్శకుడు ఫీల్​గుడ్​ మ్యూజిక్ కంపోజ్ చేయలేడని అన్నారు.

దీంతో ఈ రెండు కామెంట్స్​ సినీ ప్రియులు పోల్చి చూస్తూ.. తమన్ చేసిన వ్యాఖ్యలతో కాస్త తేడాగా ఉన్నాయని అంటున్నారు. జైలర్​ కంటెంట్​ పరంగా కాస్త తక్కువైనా.. మ్యూజిక్​ ఆ సినిమాను బాగా లేపిందని మరోసారి గుర్తుచేస్తున్నారు. అలానే ఇంకొంతమంది రజనీకాంత్​-తమన్.. ఇద్దరి ఎవరి కామెంట్స్​ కరెక్ట్​ అంటూ ఆలోచిస్తున్నారు.

ఏదేమైనప్పటికీ అఖండ తర్వాత ఆ రేంజ్ సెన్సేషన్ ​ మ్యూజిక్ రాలేదనే చెప్పాలి. బ్రో, సర్కారు వారి పాట వంటి చిత్రాలు బాగానే ఉన్నప్పటికీ మరీ హైరేంజ్​లో సెన్సేషన్ అవ్వలేదు. ఇక ​ రీసెంట్​గా ఆయన అందించిన స్కంద కూడా అంతే. తాజాగా భగవంత్ కేసరి మ్యూజిక్​ డీసెంట్​గా ఉంది తప్పా మరీ ఎక్స్​ట్రార్డనరీగా ఏమీ లేదు.