Begin typing your search above and press return to search.

ఆయన లో ఊపు తగ్గిందేంటి..?

అఖండ, వీర సింహా రెడ్డిల తర్వాత బాలయ్యతో చేస్తున్న థమన్ రీసెంట్ గా వచ్చిన గణేష్ యాంతం సాంగ్ తో నిరాశపరిచాడు

By:  Tupaki Desk   |   26 Sept 2023 9:00 AM IST
ఆయన లో ఊపు తగ్గిందేంటి..?
X

టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు థమన్. దేవి ఓ పక్క సెలెక్టెడ్ సినిమాలతో సత్తా చాటుతుంటే థమన్ మాత్రం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. సినిమాకు థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే కొన్ని అంచనాలు ఏర్పడతాయి. ఒక్కోసారి వాటిని మించి అదరగొట్టేస్తాడు థమన్. ఏంటి ఈ మ్యూజిక్ ఇచ్చింది థమనేనా అన్న ఆలోచన వచ్చేలా చేస్తాడు.

కానీ అదే థమన్ మరో సినిమాకు చాలా నార్మల్ ఆల్బం కరెక్ట్ గా చెప్పాలంటే దారుణమైన మ్యూజిక్ ఇస్తాడు. సినిమాకు థమన్ తీసుకునే రెమ్యూనరేషన్ ఒకటే కానీ కొన్ని సినిమాలకు థమన్ ఇచ్చే మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంటే కొన్ని సినిమాలకు మాత్రం థమన్ సాంగ్స్ మైనస్ అవుతున్నాయి. ఇటీవల వచ్చిన కొన్ని డిజాస్టర్ సినిమాలను చూస్తే థమన్ మ్యూజిక్ కూడా అందుకు ఒక కారణం అనిపించేలా ఉన్నాయి.

ఇక సూపర్ హిట్ సినిమాలకు ఎలాగు మ్యూజిక్ కూడా సపోర్ట్ గా ఉంటుంది. థమన్ ఈ ఒక్కటి మార్చుకోగలిగితే మాత్రం అతను మరి కొన్నాళ్లు టాప్ లీగ్ లో కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం థమన్ రామ్ స్కంద సినిమాకు మ్యూజిక్ అందించాడు. సాంగ్స్ అంత రీచింగ్ అయ్యేలా లేవు కానీ సినిమాలో అలరిస్తాయేమో చూడాలి. బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

అఖండ, వీర సింహా రెడ్డిల తర్వాత బాలయ్యతో చేస్తున్న థమన్ రీసెంట్ గా వచ్చిన గణేష్ యాంతం సాంగ్ తో నిరాశపరిచాడు. సరైన పాట పడితే ప్రతి ఏడాది ఆ పాట మారు మ్రోగే అవకాశం ఉండేది కానీ థమన్ కొత్తగా ట్రై చేసే సరికి అది ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. అఖండ టైం లో థమన్ చూపించిన ఆ జోష్ భగవంత్ కేసరికి కనిపించట్లేదు. మరి థమన్ అదే ఊపు కొనసాగించి మ్యూజిక్ అందిస్తే బాగుంటుందని మ్యూజిక్ లవర్స్, సినీ ప్రేక్షకులు కోరుతున్నారు.

ఇవే కాదు మహేష్ గుంటూరు కారం తో పాటుగా రాబోతున్న స్టార్ సినిమాలకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆ సినిమాలతో అయినా థమన్ మరోసారి తన మ్యూజిక్ తో మెప్పిస్తాడా లేదా అన్నది చూడాలి. స్టార్ సినిమాలకు మ్యూజిక్ చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ముఖ్యంగా RR తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాల్సి ఉంటుంది. మళ్లీ థమన్ లో అలాంటి ఊపు రావాలని మ్యూజిక్ లవర్స్ కోరుతున్నారు.