Begin typing your search above and press return to search.

దసరా.. తమన్ ఎలా తట్టుకుంటాడో?

అందుకే ఈ దసరా తమన్ కి ఓ విధంగా చాలా చాలెంజింగ్ టైం. ముగ్గురు స్టార్ హీరోల అభిమానుల నుంచి కూడా ఆ సమయంలో తమన్ వర్క్ పై రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:32 AM GMT
దసరా.. తమన్ ఎలా తట్టుకుంటాడో?
X

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తోన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోల చిత్రాలన్నీ తమన్ చేతిలోనే ఉన్నాయి. ప్రతి ఒకట ఒకటి, రెండు సినిమాలు తమన్ మ్యూజిక్ అందించినవి థియేటర్స్ లోకి వస్తున్నాయి. అయితే అల వైకుంఠపురంలో తర్వాత ఆ స్థాయిలో గుర్తుండిపోయే సాంగ్స్ ఈ మధ్యకాలంలో తమన్ నుంచ రాలేదని చెప్పాలి.

ఇప్పటికే అరడజను సినిమాలు వచ్చిన అందులో ట్రెండ్ అయ్యే సాంగ్ ఒక్కటి కూడా లేదు. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా కూడా నెగిటివ్ ర్ రిమార్క్స్ వస్తున్నాయి. మొదటి నుంచి తమన్ పై ఉన్న కాపీ క్యాట్ ఇమేజ్ కూడా అస్సలు చెరిగిపోవడం లేదు. ప్రతి సినిమాలో సాంగ్స్ ని ఏదో ఒక మూవీతో కంపారిజన్ చేస్తున్నారు. అయితే తమన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా స్కంద సినిమాకి తమన్ మ్యూజిక్ అందించారు. దీనిపై చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. మరీ శృతిమించిపోయిందని ఆడియన్స్ నుంచి వచ్చిన మాట. ఇప్పుడు బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న భగవంత్ కేసరికి కూడా తమన్ మ్యూజిక్ సమకూర్చారు. మ్యూజిక్ పరంగా ట్రైలర్ వరకు అయితే పెద్ద బ్యాడ్ రిమార్క్స్ అయితే ఏమీ రాలేదు.

మూవీ దసరాకి రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తమన్ జాతకం ఎలా ఉండబోతోంది అనేది తెలియాల్సి ఉంది. ఇక అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తోన్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వనుంది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ సాంగ్ కూడా దసరాకి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా మూడు సినిమాల భవిష్యత్తు దసరాకి తెలిసిపోనుంది.

అందుకే ఈ దసరా తమన్ కి ఓ విధంగా చాలా చాలెంజింగ్ టైం. ముగ్గురు స్టార్ హీరోల అభిమానుల నుంచి కూడా ఆ సమయంలో తమన్ వర్క్ పై రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అవి ఎలా వస్తాయి. వాటిని తమన్ ఎలా తట్టుకుంటాడు అనేది వేచి చూడాలి.