తమన్ మూడేళ్ల కిందటి పోస్ట్ ఇప్పుడు వైరల్
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ మణిశర్మ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా తమన్ తన గురువు మణిశర్మను గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
By: Tupaki Desk | 12 July 2025 2:00 PM ISTటాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ మణిశర్మ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా తమన్ తన గురువు మణిశర్మను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. దాదాపు 8 ఏళ్ల పాటూ మణిశర్మ దగ్గర వర్క్ చేసిన తమన్ ఆ తర్వాత సొంతంగా మ్యూజిక్ డైరెక్టర్ గా మారి అవకాశాలు అందుకుని తన సత్తా చాటుతూ వరుస సినిమాలతో కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు.
అయితే తమన్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సడెన్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దానికి కారణం అతడు సినిమా రీరిలీజ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు సినిమా ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ కు రెడీ అవుతుంది. అతడు సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారనే సంగతి తెలిసిందే.
అతడు రీరిలీజ్ సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ ఆ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను మాట్లాడుకుంటూ తమన్ కు సంబంధించిన ఓ వీడియోను కూడా బయటకు తీసుకొచ్చారు. ఆ వీడియోలో అతడు సినిమాలోని అవును నిజం సాంగ్ ను రీక్రియేట్ చేశారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు మణిశర్మ, కోటి, తమన్. ఈ ముగ్గురూ కలిసి ఆ సాంగ్ ను వాయించిన వైనం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
మూడేళ్ల కిందట ఓ సందర్భంలో ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లంతా కలిసి అతడు సినిమాలోని అవును నిజం సాంగ్ ను మరోసారి కంపోజ్ చేయగా ఆ వీడియోను తమన్ తన ఎక్స్‌లో షేర్ చేస్తూ నా గురువులు మణిశర్మ, కోటి గార్లతో ఓ అద్భుతమైన రోజు. డ్రమ్స్ పై వాయించడం చాలా హై ఇచ్చిందని రాసుకొచ్చారు. అప్పుడెప్పుడో తమన్ పోస్ట్ చేసిన ఈ వీడియోను మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు బయటికి తీసుకొచ్చి దాన్ని వైరల్ చేస్తున్నారు.
