అడ్రస్ పంపు బే.. తమన్ ఫైర్!
ధోనీ స్టైల్‌లో కొట్టినట్లు అనిపించే ఈ షాట్ చూసి చాలా మంది అభిమానులు ఆనందంతో రిప్లై ఇచ్చారు.
By: Tupaki Desk | 26 Jun 2025 4:05 PM ISTమ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎంత గొప్ప సంగీత దర్శకుడో అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు క్రికెట్ అంటే కూడా ఎంత అభిమానమో తరచూ సోషల్ మీడియాలో చూపిస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంతో ఇష్టం ఉండటంతో అతడిని పలుమార్లు తలచిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా థమన్ షేర్ చేసిన ఓ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
థమన్ తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియోలో సిక్స్ కొట్టిన విధానం హైలెట్ అయ్యింది. ఇక "Don't bowl short bro" అంటూ సరదాగా క్యాప్షన్ కూడా ఇచ్చాడు. కామెంట్. ఒకరు షార్ట్ బాల్ వేయగా.. దాన్ని తమన్ భారీగా కొట్టినట్టు కనిపిస్తుంది. ధోనీ స్టైల్‌లో కొట్టినట్లు అనిపించే ఈ షాట్ చూసి చాలా మంది అభిమానులు ఆనందంతో రిప్లై ఇచ్చారు.
అయితే థమన్ వీడియోపై ఓ యూజర్ స్పందిస్తూ, "షార్ట్ కి స్లాట్ కి తేడా తెలీనప్పుడే అర్థం అయింది నువ్వు ధోనీ ఫ్యాన్ అని" అని సెటైరికల్ గా రిప్లై ఇచ్చాడు. ఇది తెలివిగా, సరదాగా ఉండటంతో అది కూడా వైరల్ అయింది. అయితే ఈ ట్వీట్‌పై థమన్ బాగా ఫైర్ అయ్యారు. "ఓకే రా.. వచ్చీ నేర్చుకుంటా అడ్రస్ పంపు బే.. అంటూ ఫన్ అండ్ ఫైర్ కలిపిన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు.
ఇది కూడా క్షణాల్లోనే వేలాది లైక్స్, రీట్వీట్స్ సంపాదించింది. థమన్‌కు క్రికెట్ మీద ప్రేమ ఎక్కువే. ముఖ్యంగా ధోనీ ఫ్యాన్ అన్న ట్యాగ్ వినగానే ఆయన రియాక్షన్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ ట్వీట్స్‌లో ఇద్దరి మధ్య మాటల తూటాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అభిమానులు థమన్ రిప్లైని ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
“అన్నయ్యకి క్రికెట్ అంటే పిచ్చి.. కానీ ఈసారి ఫుల్ ఫైర్‌లో ఉన్నట్టు” అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో, థమన్ ట్వీట్‌లో ఉన్న సరదా తీరు చూసి “అన్నయ్య ఈజ్ బ్యాక్” అంటున్నారు. ఇటీవలి కాలంలో సినిమాలతో పాటు పర్సనల్ పోస్టులతోనూ థమన్ వైరల్ అవుతున్నా, ఈ క్రికెట్ ట్వీట్ మాత్రం అంచనాలకు మించిన రీచ్‌ను సాధించింది. ఇక.ప్రస్తుతం తమన్ అఖండ 2 - ది రాజాసాబ్ లాంటి బిగ్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.
