Begin typing your search above and press return to search.

తొలిప్రేమ మ్యాజిక్ మళ్లీ రిపీట్

తాజాగా ఈ సినిమా మ్యూజిక్ పనులు వేగంగా సాగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ గాంధీ కలిసి మ్యూజిక్ సెషన్స్ లో పాల్గొంటున్నారు.

By:  Tupaki Desk   |   21 July 2025 4:55 PM IST
తొలిప్రేమ మ్యాజిక్ మళ్లీ రిపీట్
X

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. అలాగే ప్రయోగాలు చేయడంలో కూడా ముందుంటాడు అని ఇదివరకు క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ మెగా హీరో తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. విభిన్న కథాంశాలపై దృష్టి పెట్టిన వరుణ్, ఇప్పుడు ఓ ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.


మెర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న VT15 అనే ఈ సినిమా, ఇండియన్-కొరియన్ బ్యాక్ డ్రాప్ హారర్ కామెడీగా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇండియన్ సినిమాలో ఎప్పుడూ చూడని విభిన్న కోణంలో కథను చూపించబోతున్నారనే ఆసక్తి సినిమాపై ఏర్పడింది. ఇదే విషయాన్ని టెక్నికల్ టీమ్ బలంగా నమ్ముతోంది.

తాజాగా ఈ సినిమా మ్యూజిక్ పనులు వేగంగా సాగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ గాంధీ కలిసి మ్యూజిక్ సెషన్స్ లో పాల్గొంటున్నారు. ఇది వరుణ్ తేజ్ థమన్ కాంబినేషన్‌కు రెండో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘తొలిప్రేమ’ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు VT15కు కూడా థమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఇప్పటికే రెండు పాటలు షూట్ చేయగా, ఆ పాటలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవబోతున్నాయని చిత్ర బృందం తెలిపింది. మ్యూజిక్ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. పాటల విజువల్స్ కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక నేపథ్య సంగీతం విషయంలో కూడా థమన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుతున్నారట.

వరుణ్ తేజ్ పాత్ర ఈ చిత్రంలో చాలా స్పెషల్‌గా ఉండబోతోందని సమాచారం. భిన్నమైన గెటప్, కొత్తగా డిజైన్ చేసిన క్యారెక్టర్‌తో ప్రేక్షకులను మెప్పించనున్నాడట. ఎమోషన్, కామెడీ, హారర్.. అన్ని అంశాలను బ్యాలెన్స్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమా ఒక పూర్తి స్థాయి ఎంటర్టైనర్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో, త్వరలో ఫస్ట్ లుక్, టైటిల్‌ను రిలీజ్ చేయబోతున్నారు.