Begin typing your search above and press return to search.

లెనిన్ క‌థ విన్న వెంట‌నే అఖిల్ కు త‌మ‌న్ మెసేజ్

తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మన్ చేసిన కామెంట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   8 July 2026 7:36 PM IST
లెనిన్ క‌థ విన్న వెంట‌నే అఖిల్ కు త‌మ‌న్ మెసేజ్
X

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన లెనిన్ రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మన్ చేసిన కామెంట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా అఖిల్ యాక్టింగ్, క్లైమాక్స్ ఎమోషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఆయన చెప్పిన మాటలు అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి.

థియేటర్లలో ఈ సినిమా సౌండ్ గురించి మాట్లాడుతూ, త‌మన్ వల్ల థియేటర్లలో బాక్సులు బద్దలైపోతాయంటున్నారు.. నిజమేనా? అని అడగగా, వెంటనే స్పందించిన అఖిల్ అవును.. అయిపోతాయి.. డోంట్ వరీ అంటూ నవ్వులు పూయించారు. ఇప్పటికే సినిమా కాపీలన్నీ పంపించామని, ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫైనల్ వెర్షన్‌ను చూసే వ‌స్తున్నాన‌ని అఖిల్ వెల్లడించాడు. దీంతో సినిమాకు త‌మన్ అందించిన నేపథ్య సంగీతంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక అఖిల్‌లో కనిపిస్తున్న ప్రశాంతత గురించి ఒక‌రు ప్రశ్నించగా త‌మన్ తనదైన శైలిలో స్పందించారు. అఖిల్‌కు పెళ్లి అయింది కదా... పెళ్లి తర్వాత లైఫ్ ఆటోమేటిక్‌గా కామ్ అయిపోతుందంటూ సరదాగా అన్నారు. అదే టైమ్ లో ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడ‌నే విష‌యాన్ని త‌మ‌న్ స్పెష‌ల్ గా చెప్పారు. ఆ క్యారెక్ట‌ర్ కోసం ఆయన పెట్టిన శ్రమ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుందని త‌మ‌న్ చెప్పారు. అఖిల్ కు క‌థ చెప్పి, డైరెక్ట‌ర్ త‌న‌కు క‌థ చెప్పిన చెప్పిన తొలి సందర్భాన్ని గుర్తు చేసుకున్న త‌మన్, క‌థ విన్న వెంట‌నే ఈ ప్రాజెక్ట్‌పై తనకు పూర్తి నమ్మకం వచ్చిందని, వెంటనే అఖిల్‌కు ఈ సినిమాను అస్సలు వదలొద్దు. ఇది వేరే లెవెల్ సినిమా. దీన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్దామ‌ని చెప్తూ మెసేజ్ చేశానంటూ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

లెనిన్ అఖిల్ సినీ కెరీర్లో ఓ ల్యాండ్‌మార్క్ మూవీగా నిలుస్తుంద‌ని, తనలో ఉన్న అసలు నటుడిని ఈ సినిమా ప్రేక్షకులకు చూపిస్తుంద‌ని, అతను ఏం చేయగలడో చెప్పే స్టేట్‌మెంట్ మూవీ ఇదేన‌ని ప్రశంసించారు. సినిమాలో క్లైమాక్స్ మెయిన్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తుంద‌ని చెప్తూ, క్లైమాక్స్ చూస్తే ఆడియ‌న్స్ కు గూస్‌బంప్స్ రావడం ఖాయ‌మ‌ని, ఈ సినిమాకు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేయాలనే తపనతో తాను, అఖిల్ ఇద్దరం వ‌ర్క్ చేశామ‌ని త‌మన్ పేర్కొన్నారు.