నందమూరి తమన్.. భలే సింక్ కుదిరిందే!
భైరవ ద్వీపం సినిమాకు మాధవపెద్ది సురేష్ మ్యూజిక్ డైరెక్టర్. మొదటి సినిమాకే విజయ లాంటి సంస్థలో పని చేసే ఛాన్స్ దక్కడమంటే మాటలు కాదు.
By: Tupaki Desk | 17 April 2025 11:30 PMసౌత్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా చలామణి అవుతున్న తమన్ ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే తమన్ ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలతో పని చేసినప్పటికీ ఆయన ఎక్కువ హిట్లు ఇచ్చిన హీరో మాత్రం బాలకృష్ణనే. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకుంది ఈ కాంబో.
త్వరలోనే వీరి కలయికలో అఖండ2 రాబోతుంది. అఖండ సినిమాతో స్పీకర్లు పగిలిపోయే మ్యూజిక్ ఇచ్చిన తమన్, ఈ సారి అఖండకు మించి మ్యూజిక్ ఇవ్వనున్నాడని, థియేటర్ సౌండ్ సిస్టమ్స్ ను ముందే అప్డేట్ చేసుకోమని ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. అయితే తమ హీరో అందుకుంటున్న వరుస సక్సెస్ లలో కీలక పాత్ర వహిస్తున్న తమన్ ఇంటిపేరుని నందమూరిగా మార్చి నందమూరి తమన్ ను చేస్తూ పలు సందర్భాల్లో ఫ్యాన్స్ తమన్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
తమన్ పేరుని నందమూరి తమన్ గా మార్చడం పట్ల తమన్ కూడా ఆనందం వక్తం చేశాడు. దీంతో తమన్, నందమూరి ఫ్యాన్స్ పట్ల ఎంత బాండింగ్ ఉందో అర్థమవుతుంది. అయితే ఈ బంధం ఇప్పుడు మొదలైంది కాదు. తమన్ కెరీర్ స్టార్ట్ చేసింది డ్రమ్స్ ఆర్టిస్ట్ గా అనే విషయం తెలిసిందే. 1994లో వచ్చిన భైరవ ద్వీపం సినిమాతో తమన్ తక కెరీర్ ను మొదలుపెట్టాడు.
భైరవ ద్వీపం సినిమాకు మాధవపెద్ది సురేష్ మ్యూజిక్ డైరెక్టర్. మొదటి సినిమాకే విజయ లాంటి సంస్థలో పని చేసే ఛాన్స్ దక్కడమంటే మాటలు కాదు. ఆ సినిమాకు ఫస్ట్ డే రెమ్యూనరేషన్ గా తమన్ కు మూడు పది రూపాయల నోట్లు ఇచ్చారని, అంటే రూ. 30 తన తొలి సంపాదన అని తమన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ సినిమా మొత్తానికి తనకు రూ.270 వచ్చాయని తమన్ వెల్లడించాడు. మొత్తానికి అలా తమన్ బాలయ్య మధ్య బాండింగ్ అప్పటి నుంచే మొదలైందని అర్థమవుతుంది.
అలా చిన్న మొత్తం రెమ్యూనరేషన్ కు కెరీర్ స్టార్ట్ చేసిన తమన్ ఇప్పుడు కోట్లలో పారితోషికాన్ని తీసుకుంటున్నాడు. బాలయ్య వరుస హిట్లలో తమన్ కాంట్రిబ్యూషన్ చూసి సరదాగా నందమూరి ఫ్యాన్స్ పెట్టిన పేరు యాదృచ్ఛికంగా భలే కలిసిందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ప్రస్తుతం తమన్ చేతిలో అఖండ2 తో పాటూ రాజా సాబ్, ఓజి, తెలుసు కదా సినిమాలున్నాయి.