Begin typing your search above and press return to search.

థమన్ ఒప్పించాడా.. తప్పించాడా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అది థమన్ అనే చెప్పొచ్చు. వరుస సినిమాలు అందులోనూ ఒకదానికి మించి మరొకటి అనిపించేలా వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 Sept 2025 1:38 PM IST
థమన్ ఒప్పించాడా.. తప్పించాడా..?
X

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అది థమన్ అనే చెప్పొచ్చు. వరుస సినిమాలు అందులోనూ ఒకదానికి మించి మరొకటి అనిపించేలా వస్తున్నాయి. స్టార్ సినిమాలే కాదు యువ హీరోల సినిమాలు కూడా చేస్తున్నాడు థమన్. ఈ క్రమంలో థమన్ కూడా సినిమాలకు ఒక క్రేజీ కీ ఫ్యాక్టర్ గా మారాడు. ముఖ్యంగా థమన్ బిజిఎం స్టార్ సినిమాలకు పెద్ద అసెట్ గా మారుతుంది. కొన్ని సినిమాలు థమన్ బిజిఎం బాగా వర్క్ అవుట్ అవ్వడం వల్లే అనుకున్న దాని కన్నా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాయని చెప్పొచ్చు.

రెండు సినిమాలకు థమన్ ఒక్కడే..

ఇదిలా ఉంటే దసరా బరిలో దిగాల్సిన రెండు భారీ సినిమాలకు కూడా థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆ రెండు సినిమాలేంటో అందరికీ తెలిసిందే. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కాగా.. రెండోది బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2. ఈ రెండు సినిమాలకు థమన్ ఇచ్చే మ్యూజిక్ చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అసలైతే ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వాల్సింది. కానీ అఖండ 2 ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది చెప్పలేదు కానీ అఖండ 2 సినిమా ఎప్పుడొచ్చినా సూపర్ హిట్ పక్కా అంటున్నారు. ఓజీ, అఖండ 2 రెండు సినిమాలకు థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. రెండు కూడా డిఫరెంట్ సినిమాలే. ముందు రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అనేసరికి థమన్ కాస్త కంగారు పడ్డాడట. ఎందుకంటే ఓజీ సినిమాకు థమన్ క్రేజీ మ్యూజిక్ అందిస్తున్నాడు. అసలు థమన్ ఒక స్థాయిలో ఈ సినిమాకు కష్టపడుతున్నాడు.

అఖండ 2 మరోసారి పూనకాలు..

మరోపక్క అఖండ 2 కూడా థమన్ మరోసారి పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ఐతే అఖండ 2 సినిమా మ్యూజిక్ కి కాస్త టైం ఇవ్వాలని మేకర్స్ తో చెప్పాడట థమన్. అందులోనూ సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఓజీకి థమన్ పూర్తిస్థాయిలో టైం కేటాయిస్తున్నాడు. అందుకే అఖండ 2 థమన్ వల్ల కూడా కొంత లేట్ అవుతుందని తెలుస్తుంది. ఐతే థమన్ అఖండ 2 కి కూడా మరోసారి స్పీకర్లు బ్లాస్ట్ అయ్యే మ్యూజిక్ ఇస్తున్నాడట.

థమన్ ఎలా ఒప్పించాడో తెలియదు కానీ ఈ రెండు సినిమాలు ఒకే రోజు రాకపోవడం వల్ల ఫ్యాన్స్ కన్నా థమన్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడట. ఓజీ సోలో రిలీజ్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతుంది. ఇక అఖండ 2 సినిమా డిసెంబర్ లేదా 2026 జనవరి రిలీజ్ అంటున్నారు. ఈ రెండు సినిమాలతో థమన్ మళ్లీ ఒక రేంజ్ హవా కొనసాగించబోతున్నాడు. సో ఈ రెండు కూడా థమన్ కి ఫుల్ క్రేజ్ తెచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాదు ప్రభాస్ రాజా సాబ్ కి థమన్ మ్యూజిక్ హైలెట్ అవ్వబోతుంది.