ఏరియాను బట్టి మ్యూజిక్ టేస్ట్ మారుతుంది
తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం పలు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. కీ బోర్డు ప్లేయర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన తమన్, ఇప్పుడు సౌత్ లోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతూ తన సత్తా చాటుతున్నాడు.
By: Tupaki Desk | 14 May 2025 11:30 AMతెలుగు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం పలు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. కీ బోర్డు ప్లేయర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన తమన్, ఇప్పుడు సౌత్ లోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతూ తన సత్తా చాటుతున్నాడు. 64 మంది మ్యూజిక్ డైరెక్టర్లతో దాదాపు 900 సినిమాలకు పైగా వర్క్ చేసిన తమన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మ్యూజిక్ గురించి పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు.
మ్యూజిక్ ఆడియన్స్ కు కనెక్ట్ అవడానికి కీలకమైంది అక్కడి కల్చర్ అని, దాన్ని అర్థం చేసుకుని మ్యూజిక్ చేస్తే తప్పకుండా మ్యూజిక్ క్లిక్ అవుతుందని తమన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. తాను హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోని సినిమాలకు సంగీతం అందించానని ఆ టైమ్ లోనే ఎక్కడి ఆడియన్స్ ఎలాంటి పాటలు వింటారో తెలుసుకున్నానని వెల్లడించాడు.
భౌగోళిక పరిస్థితులను బట్టి మ్యూజిక్ టేస్ట్ మారుతుందని తమన్ చెప్పాడు. తడ మరియు సూళ్లూరుపేట కు దూరం 50 కిలోమీటర్లే అయినప్పటికీ ఆ రెండు ప్రాంతాల వాళ్లు వినే మ్యూజిక్ వేరుగా ఉంటుందని, ప్రతి ప్రాంతానికి మ్యూజిక్ పరంగా స్పెషల్ ఐడెంటిటీ ఉంటుందని, అదే దేశానికి గొప్ప అందమని తమన్ తెలిపాడు.
ప్రతీ భాషకూ సొంత రిథమ్ తో పాటూ ఆత్మ కూడా ఉంటుందని, ఎన్నో భాషల్లో పని చేసిన అనుభవమే తనకు ఈ విషయాన్ని నేర్పిందని తమన్ పేర్కొన్నాడు. ఒక భాషలో వర్కవుట్ అయ్యే మ్యూజిక్ మరో లాంగ్వేజ్ కు వర్కవుట్ అవదని, తెలుగు మ్యూజిక్ తమిళంలో వర్కవుట్ అవదని, తమిళ మ్యూజిక్ మలయాళం, కన్నడలో వర్కవుట్ అవదని తమన్ చెప్పుకొచ్చాడు.
అందుకే వేరే భాషలో సినిమా చేసేటప్పుడు అసలు అక్కడి వాళ్లు ఏం వింటారు? ఎలాంటి మ్యూజిక్ ను ఇష్టపడతారు అక్కడి యాస ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి కొంత టైమ్ తీససుకుంటామని తమన్ తెలిపాడు. రీసెంట్ టైమ్స్ లో అక్కడ ఎలాంటి మ్యూజిక్ వర్కవుట్ అయిందో, ఆ ఏరియాలో ఏం ట్రెండ్ అయ్యాయో తెలుసుకుని అప్పుడే మ్యూజిక్ కంపోజ్ చేయడం స్టార్ట్ చేస్తామని, మంచి మ్యూజిక్ కు అక్కడి మూలాలు కూడా ఎంతో ముఖ్యమని తాను నమ్ముతానని తమన్ ఈ సందర్భంగా తెలిపాడు.