S తమన్ Vs SS తమన్.. అసలు పేరేంటి?
తెలుగు చిత్రసీమలో సంగీత విభాగాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
By: Tupaki Desk | 16 April 2025 2:13 PM ISTతెలుగు చిత్రసీమలో సంగీత విభాగాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'కిక్', 'దూకుడు', 'అల వైకుంఠపురములో' వంటి సినిమాలతో మాస్ ఆడియన్స్‌ను తన ట్యూన్స్‌తో ఊపేసిన ఈ సంగీత దర్శకుడు, తాజాగా ఓ ఆసక్తికరమైన అంశాన్ని బయటపెట్టారు. తన పేరుతో సంబంధం ఉన్న ఈ వివరాలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.
ఒక ఇంటర్వ్యూలో యాంకర్ సుమ తమన్‌ను ప్రశ్నిస్తూ, కొన్ని సినిమాల్లో.. S తమన్, మరికొన్నింట్లో SS తమన్.. అని ఎందుకు చూపిస్తున్నారు? అనే సందేహాన్ని స్పష్టం చేయాలని కోరారు. ఈ ప్రశ్నకు తమన్ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. తన అసలు పేరు ‘S తమన్’(సాయి తమన్) అని స్పష్టం చేస్తూ, ఎస్‌ఎస్ తమన్ అనే పేరు మాత్రం తాను ఎప్పుడూ వాడలేదని తెలిపారు.
తమన్ వివరిస్తూ, “నా అసలు పేరు ఎస్ తమన్. కానీ అప్పట్లో ఎవరో ఒకరు ‘SS తమన్’ అని టైటిల్స్‌లో వేసారు. ఆ పేరును చూసి మిగతా సినిమాలకూ అదే తరహా ఫార్మాట్‌ను ఫాలో అయ్యారు. అప్పట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత చూస్తే, ఆ పేరుతో వచ్చిన సినిమాల్లో చాలా ఫ్లాప్ అయ్యాయి. ఈ పేరుపై నాకు నమ్మకం లేకపోవడం కాదు… కానీ ఆ టైంలో ఆడియన్స్, మేకర్స్ లో కొంత కన్ఫ్యూజన్ వచ్చిందనిపించింది. అందుకే ఇకపై స్పష్టత కోసం ఎస్ తమన్‌గానే ఫిక్స్ అయ్యాను,” అని వివరించారు.
ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ మాదిరిగానే తమన్ కూడా తన బ్రాండ్ పేరును నిలబెట్టుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. పేరులో చిన్న మార్పే అయినా, అది క్రియేటివ్ ఫీల్డ్‌లో చాలా పెద్ద ప్రభావం చూపించగలదని ఆయన చెబుతున్నారు. ఇటీవలికాలంలో తమన్ సినిమాల సంఖ్యను తగ్గించి, క్వాలిటీ మీద ఫోకస్ పెంచాడు. ‘అఖండ ’ నుంచి మొదలైన ఈ మార్పు, ‘సర్కారు వారి పాట’, ‘బ్రో’ వంటి సినిమాల వరకూ కొనసాగింది.
ప్రస్తుతం అఖండ 2తో పాటు మరికొన్ని బాలీవుడ్ కోలీవుడ్ సినిమాలకు కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో తదితర ప్రాజెక్టులపై పనిచేయున్నారనే టాక్ వస్తోంది. ఇక లిస్టులో అఖిల్ లెనిన్, ప్రభాస్ రాజాసాబ్, పవన్ OG వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తమన్ ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం స్పెషల్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు.
