మళ్లీ నటించడానికి కారణం అదే
ఇన్నేళ్ల తర్వాత సినిమా ఒప్పుకోవడానికి రీజన్ ను తమన్ రీసెంట్ గా సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వెల్లడించాడు.
By: Tupaki Desk | 16 April 2025 12:12 PM ISTటాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పలు ప్యాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన తమన్ ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో బాయ్స్ సినిమాలో ఓ రోల్ చేసిన తమన్ ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు కెమెరా ముందుకు వస్తున్నాడు.
ఇన్నేళ్ల తర్వాత సినిమా ఒప్పుకోవడానికి రీజన్ ను తమన్ రీసెంట్ గా సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వెల్లడించాడు. అదే ఇంటర్వ్యూలో మరికొన్ని ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించాడు తమన్. ఈ సందర్భంగా తమన్ ను సుమ మీరు ఓ సినిమా చేస్తున్నారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందనే విషయం తెలుసా అని ప్రశ్నించింది.
ఆ ప్రశ్నకు తమన్ తనదైన శైలిలో సరదాగా స్పందించాడు. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారనే కారణంతోనే ఒప్పుకున్నా. పైగా మ్యూజిక్ డైరెక్టర్ గా బాధ్యతలు కూడా నాకే ఇచ్చారు అందుకే ఆ సినిమా చేస్తున్నా అని అన్నాడు తమన్. మరి ఇదయమ్ మురళి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందని సుమ అడగ్గా, దానికి తమన్ నేను షూటింగ్ కు వెళ్లినప్పుడు అంటూ సరదాగా ఆన్సర్ ఇచ్చాడు.
మ్యూజిక్ డైరెక్టర్ గా వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా వాయిదా పడుతూ వస్తుందని, 10 రోజుల పాటూ ఓ సీన్ షూటింగ్ లో కూడా పాల్గొన్నానని తెలిపాడు. తన పేరు ఎస్. తమన్ అని, కానీ మొదట్లో తన పేరుని ఎస్.ఎస్ తమన్ అని వేసేవాళ్లని, అలా పేరు వేసిన సినిమాలు దాదాపు 10 ఫ్లాపు అయ్యాయని, కానీ ఇప్పుడు సీన్ మారిందని, పేరు విషయంలో మొత్తం మన కంట్రోల్ లోనే ఉందని తమన్ తెలిపాడు.
ఇదే ఇంటర్య్వూలో తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి కూడా తమన్ మాట్లాడాడు. తాను మొదటిగా వర్క్ చేసిన సినిమా భైరవద్వీపం అని మొదటి రోజు తనకు జీతంగా రూ.30 రూపాయలు ఇచ్చారని, మొత్తం సినిమాకు రూ.270 తీసుకున్నట్టు తమన్ వెల్లడించాడు. రూ.30 రెమ్యూనరేషన్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన తమన్ ఇప్పుడు సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలుగుతున్న వైనం అందరికీ ఎంతో ఆదర్శప్రాయం.
