Begin typing your search above and press return to search.

రష్మిక సినిమా... వాటిల్లా ఉండదట!

సౌత్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా పేరు దక్కించుకుని బాలీవుడ్‌ పై దండయాత్ర చేస్తున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న

By:  Tupaki Desk   |   10 Jun 2025 11:00 PM IST
రష్మిక సినిమా... వాటిల్లా ఉండదట!
X

సౌత్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా పేరు దక్కించుకుని బాలీవుడ్‌ పై దండయాత్ర చేస్తున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ అమ్మడు తెలుగులో చేసిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఆ సినిమా వసూళ్లు బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కి సైతం షాక్‌ అయ్యాయి. ఒక సౌత్‌ సినిమా, అది కాకుండా ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో హిట్‌ కావడం మామూలు విషయం కాదు అంటూ స్వయంగా బాలీవుడ్‌ ప్రముఖులు సైతం అన్నారు. అలాంటి సినిమాలో నటించడం ద్వారా రష్మిక మందన్నకు బాలీవుడ్‌లో స్టార్‌డం దక్కింది. నార్త్‌ ఇండియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్‌ కారణంగా వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

బ్యాక్ టు బ్యాక్‌ యానిమల్‌, ఛావా సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో బాలీవుడ్‌లో బిజీ కావడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ దురదృష్టం వెంటనే ఆమె తలుపు తట్టింది. సల్మాన్‌ ఖాన్‌తో నటించిన సికిందర్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడింది. డిజాస్టర్‌గా నిలిచిన సికిందర్‌ సినిమాలో రష్మిక మందన్న నటించడం అనేది పెద్ద పొరపాటు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సికిందర్‌ సినిమా తర్వాత రష్మిక నుంచి రాబోతున్న హిందీ సినిమా 'థమ'. ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో వచ్చిన స్త్రీ 2, భూల్‌ భులయ్యా సినిమాలతో పాటు హర్రర్‌ కాన్సెప్ట్‌ సినిమాల తరహాలోనే ఈ సినిమా ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు వీరు చేసిన ప్రచారం చూస్తే ఎవరికి అయినా అదే అనిపిస్తుంది. కానీ తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు మాట్లాడుతూ చాలా మంది అనుకుంటున్నట్లుగా మా థమ సినిమా ఇప్పటి వరకు వచ్చిన హర్రర్‌ కామెడీ సినిమాలకు పూర్తి విభిన్నంగా ఉంటాయి. స్త్రీ 2 సినిమాతో మా సినిమాకు పోలిక ఉండదు. అంతే కాకుండా ఇతర హర్రర్‌ కామెడీ సినిమాలకు సైతం మా సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని, అంతే కాకుండా ఆ సినిమాల మాదిరిగా మా సినిమా ఉండదు అని వారు అంటున్నారు.

థమ సినిమాలో థ్రిల్లర్‌ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే అతీంద్రియ శక్తుల కారణంగా ప్రేక్షకులు నవ్వుతూనే భయానక పరిస్థితులను చూస్తూ ఉంటారు. విభిన్నమైన స్క్రీన్‌ ప్లేతో పాటు, ఆకట్టుకునే విధంగా కథ ఉంటుంది కనుక కచ్చితంగా థమ సినిమా తో రష్మిక మందన్న మరోసారి హిందీలో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం. ప్రస్తుతం రష్మిక మందన కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్‌ చేయడం కోసం వెయిట్‌ చేస్తుంది. త్వరలోనే రష్మిక తెలుగు సినిమా గర్ల్‌ ఫ్రెండ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా కాలం అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.