Begin typing your search above and press return to search.

పుష్పరాజ్ ను డీ కొట్టేలా.. విజయ్ జెట్ స్పీడ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి వెళుతున్నట్లుగా అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   6 March 2024 1:30 AM GMT
పుష్పరాజ్ ను డీ కొట్టేలా.. విజయ్ జెట్ స్పీడ్
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి వెళుతున్నట్లుగా అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2026 లో జరిగే తమిళనాడు ఎన్నికలలో పాల్గొంటాను అని కూడా చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతకు ముందు వరకు కూడా ఎలాంటి రాజకీయ అంశాలపై కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వని విజయ్ అంత హఠాత్తుగా ఎందుకు పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడో ఎవరికి అర్థం కాలేదు.

కానీ తప్పకుండా అతను మాత్రం తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నాడు అని అర్థమవుతుంది. ఇక రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత విజయ్ సినిమాలు చేయకపోవచ్చు అని కూడా ముందే బలమైన టాక్ వినిపించింది. విజయ్ ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇక అతని చేతిలో ఇప్పుడు GOAT అనే సినిమా ఉంది.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను త్వర త్వరగా ఫినిష్ చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. విజయ్ కు సంబంధించిన షూట్ కేవలం ఒక కొన్ని రోజులు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. వీలైనంతవరకు ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లేదా మే మొదటి వారంలోపు ఫినిష్ కావచ్చట.

ఇక సినిమా విడుదలపై కూడా ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నట్లు సమాచారం. కుదిరితే ఆగస్టులోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే అదే సమయంలో పుష్ప 2 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 15 కు ఈ సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. పర్ఫెక్ట్ హాలిడే సీజన్ కావడంతో GOAT సినిమా కూడా అదే వారంలో రావచ్చు అని తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలు విజయ్ ఇంత జెట్ స్పీడ్ లో ఈ సినిమాను ఫినిష్ చేస్తాడు అని ఎవరు ఊహించలేదు. ఇక ఆటు తిరిగి ఇటు తిరిగి ఆ స్పీడ్ తో ఇప్పుడు పుష్ప 2ని ఢీకొట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ క్లాష్ సౌత్ లో కొంత పుష్ప 2 బాక్సాఫీస్ ని డామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా తమిళంలో విజయ డామినేషన్ ఎక్కువ కాబట్టి అక్కడ పుష్ప కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంటుంది. మరి నిజంగా ఈ వార్ ఉంటుందో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.