Begin typing your search above and press return to search.

దళపతి సినిమాలో ఊహించని సర్ ప్రైజ్..!

దళపతి విజయ్ 68వ సినిమాగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైం. G.O.A.T సినిమా సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 March 2024 4:56 AM GMT
దళపతి సినిమాలో ఊహించని సర్ ప్రైజ్..!
X

దళపతి విజయ్ 68వ సినిమాగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైం. G.O.A.T సినిమా సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు AGE ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా ప్రశాంత్, స్నేహ, ప్రభుదేవ లాంటి వారు ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించనున్నారట. ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేశాడట డైరెక్టర్ వెంకట్ ప్రభు.


సినిమాలో క్యామియో రోల్ లో స్టార్ హీరోయిన్ ని తీసుకున్నారట. సినిమాలో ఆమె పాత్ర చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుందని. ఆడియన్స్ అందరు ఆమె ని సినిమాలో చూసి షాక్ అవుతారని అంటున్నారు. ఇంతకీ ఆ పాత్రలో నటించేది ఎవరు అంటే చెన్నై చిన్నది త్రిష అని తెలుస్తుంది. దళపతి విజయ్ తో లాస్ట్ ఇయర్ లియో సినిమాలో నటించిన త్రిష మళ్లీ ఆయన చేస్తున్న G.O.A.T సినిమాలో కూడా క్యామియో రోల్ చేస్తుంది. G.O.A.T సినిమా లో త్రిష కూడా భాగం అవ్వడం ఆమె ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. విజయ్ తో ఆల్రెడీ హిట్ ట్రాక్ ఉన్న త్రిష G.O.A.T తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత తెలుగు నిర్మాత డివివి దానయ్యతో కలిసి ఒక సినిమా చేయాలని చూస్తున్న విజయ్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. ఈమధ్యనే ఆయన తన పార్టీ పేరును ప్రకటించాడని తెలిసిందే. సినిమా హీరోగా తమిళనాడులో తిరుగు లేని క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్నాడు. అయితే సినిమాలను పూర్తిగా మానేసి రాజకీయాల్లోకి వస్తాడా లేదా సినిమాలు చేస్తూ పార్టీని నడిపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

విజయ్ ప్రస్తుతం చేస్తున్నG.O.A.T సినిమా జూన్ లేదా జూలైలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. G.O.A.T సినిమా తమిళంతో పాటుగా తెలుగులో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ డివివి దానయ్య కాంబినేషన్ లో సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది మాత్రం ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు. చెన్నై మీడియా మాత్రం త్రివిక్రం డైరెక్షన్ లో దళపతి విజయ్ సినిమా ఉంటుందని హడావిడి చేస్తున్నారు. అయితే ఆ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది త్వరలో తెలుస్తుంది.