Begin typing your search above and press return to search.

విజయ్ 68.. ఎన్నో సర్ ప్రైజ్ లు..!

సినిమాలో హీరోయిన్ గా ఒకరిద్దరు పేర్లు వినిపిస్తుండగా వారితో పాటుగా నిన్నటితరం హీరోయిన్స్ జ్యోతిక స్నేహాలు కూడా ఈ సినిమాలో నటిస్తారని టాక్

By:  Tupaki Desk   |   20 Sep 2023 5:10 AM GMT
విజయ్ 68.. ఎన్నో సర్ ప్రైజ్ లు..!
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన ప్రతి సినిమాతో బాక్సాఫీస్ పై తన సత్తా చాటుతూ దూసుకెళ్తున్నారు. త్వరలో లియో అంటూ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయడానికి వస్తున్నారు విజయ్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ అవుతుంది. తెలుగులో కూడా లియో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ 68వ సినిమాగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ప్రాజెక్ట్ లాక్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు మేకర్స్.

సినిమాలో హీరోయిన్ గా ఒకరిద్దరు పేర్లు వినిపిస్తుండగా వారితో పాటుగా నిన్నటితరం హీరోయిన్స్ జ్యోతిక స్నేహాలు కూడా ఈ సినిమాలో నటిస్తారని టాక్. విజయ్ జ్యోతిక సూపర్ హిట్ జోడీ పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన జ్యోతిక ఈమధ్య రీ ఎంట్రీ ఇచ్చారు. విజయ్ సినిమాలో జ్యోతిక నటించడం సినిమాకు స్పెషల్ క్రేజ్ తీసుకొస్తుంది. వీరితో పాటుగా సినిమాలో విలన్ గా అరవింద్ స్వామిని ఓకే చేసినట్లు తెలుస్తుంది.

ఒకప్పుడు హీరోగా తన చార్మింగ్ తో ఆడియన్స్ ని అలరించిన అరవింద్ స్వామి విలన్ గా టర్న్ తీసుకున్న తర్వాత మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. స్మార్ట్ విలన్, స్టైలిష్ విలన్ గా అరవింద్ స్వామికి మంచి అవకాశాలు వస్తున్నాయి. విజయ్ సినిమాలో కూడా అతనికి విలన్ రోల్ దక్కిందట. అయితే ఇదివరకు అరవింద్ స్వామి చేసిన నెగిటివ్ రోల్స్ కి ఇది ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు.

ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ లియో రిలీజ్ తర్వాత పూర్తిగా వెంకట్ ప్రభు సినిమా మీదే ఫోకస్ చేయనున్నారట దళపతి. సో విజయ్ ఫ్యాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్ టైం అని చెప్పొచ్చు. దసరాకి లియో వస్తుండగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న సినిమా 2024 సమ్మర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్యతో కస్టడీ సినిమా చేసిన వెంకట్ ప్రభు ఈసారి టార్గెట్ చాలా పెద్దగా పెట్టుకున్నాడని తెలుస్తుంది.