జన నాయగన్ తర్వాత కూడా దళపతి విజయ్ కనిపిస్తాడా..?
ఐతే విజయ్ సొంతంగా సినిమాలు చేయడు కానీ ఆయన రిఫరెన్స్ లు మాత్రం కచ్చితంగా కనిపిస్తాయని అంటున్నారు.
By: Tupaki Desk | 13 July 2025 10:00 AM ISTదళపతి విజయ్ తన సినీ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెడుతున్న విషయం తెలిసిందే. ఆయన తన చివరి సినిమా జన నాయగన్ పూర్తి చేసి ఇక సినిమాలను ఆపేసి పూర్తిగా తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం ఇవ్వనున్నాడు. ఇప్పటికే పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు విజయ్. ఐతే జన నాయగన్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఇక విజయ్ ని చూడటం కష్టమే అనుకుంటున్నారు దళపతి ఫ్యాన్స్.
ఐతే విజయ్ సొంతంగా సినిమాలు చేయడు కానీ ఆయన రిఫరెన్స్ లు మాత్రం కచ్చితంగా కనిపిస్తాయని అంటున్నారు. అదెలా అంటే విజయ్ డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా దళపతి విజయ్ ఫ్యాన్స్ గా సినిమాలో కొన్ని రిఫరెన్స్ లు వాడతారు. అంతేకాదు హీరో ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు కూడా అవసరం ఉన్న చోట దళపతి గురించి ప్రస్తావించే అవకాశం ఉంటుంది.
ఎలాగు ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పారు కాబట్టి ఆయన నుంచి ఎలాంటి పోటీ ఉండదు. విజయ్ కే కాదు ఆయన పార్టీకి సపోర్ట్ చేసే వారు కచ్చితంగా తమ సినిమాల్లో విజయ్ గురించి ఒక డైలాగ్ అయినా పెట్టె ఛాన్స్ ఉంటుంది. ఐతే ఇదంతా విజయ్ మీద ప్రేమ కన్నా దళపతి విజయ్ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి అన్నట్టుగా చెప్పుకుంటున్నారు.
దళపతి విజయ్ మాత్రం సినిమా పరిశ్రమకు ఎప్పుడు ఏం కావాలన్నా సపోర్ట్ గా ఉంటానని అంటున్నాడు. తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడైనా కూడా పరిశ్రమకు ఏ అవసరం ఉన్నా ముందుంటానని అంటున్నాడట విజయ్. సో అలా చూసినా విజయ్ ఫ్యాన్స్ కోసమైనా అడపాదడపా సినిమాల్లో ఆయన గురించి చెప్పే అవకాశం ఉంటుంది. మరి అది ఎలా ఉంటుందో చూడాలి. విజయ్ జన నాయగన్ సినిమా కూడా ఆయన పొలిటికల్ కెరీర్ కి హెల్ప్ అయ్యేలా ఉండేలా చేస్తున్నారట.
ఈ మూవీలో పూజా హెగ్దే, మమితా బైజులు నటిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. దళపతి విజయ్ సినిమాలు మానేస్తే ఆయన ఫ్యాన్స్ నెక్స్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తారన్న బిగ్ డిస్కషన్ నడుస్తుంది. పాలిటిక్స్ లో విజయ్ వెంట ఉన్నా కూడా వాళ్లు సినిమాల్లో ఎవరిని ఎంచుకుంటారన్నది చూడాలి.
