Begin typing your search above and press return to search.

అంటే.. విజయ్ 1000 కోట్లు మిస్ చేసుకున్నాడా?

తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలో పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 April 2025 5:00 AM IST
అంటే.. విజయ్ 1000 కోట్లు మిస్ చేసుకున్నాడా?
X

తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలో పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చివరి సినిమా జననాయకన్, వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. 2026 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లకు రావడానికి రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే విజయ్ రెగ్యులర్ రాజకీయాల్లో మరింత స్పీడ్ పెంచనున్నాడు.

ఈ నేపథ్యంలో విజయ్ సినిమాల పరంగా తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్‌కి కొంత నిరాశను మిగిల్చింది. ముఖ్యంగా ఇటీవల అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌కి సంబంధించి విడుదలైన వీడియో చూసిన ఫ్యాన్స్, అదే కథను మొదట విజయ్‌కి వినిపించారని.. కానీ ఆయన రాజకీయ బిజీషెడ్యూల్ వల్ల తిరస్కరించారని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. అంతే కాకుండా లియో 2, GOAT 2, లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లోని మిగిలిన ప్రాజెక్ట్స్.. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విజయ్ ఇటీవల GOAT సినిమాకు దాదాపు రూ.200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. జననాయకన్ చిత్రానికి కూడా దాదాపు అదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే ఆయన వదిలేసిన నాలుగు పెద్ద సినిమాల ద్వారా దాదాపు రూ.800 కోట్లు రెమ్యునరేషన్ వచ్చేవి. పైగా, ఇంకొన్ని సినిమాల కోసంగా కథలు తయారయ్యాయి.

వేట్రిమారన్, కార్తిక్ సుబ్బరాజ్, మగిల్ తిరుమేని వంటి టాలెంటెడ్ దర్శకులు విజయ్ కోసం కథలు సిద్ధం చేశారు. ఇవన్నీ విజయ్ నెక్ట్స్ మూడు నుంచి ఐదేళ్లలో తీయవచ్చు అన్న అభిప్రాయంతో సిద్ధం చేశారు. విజయ్ మాత్రం పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టేందుకు దృఢంగా నిర్ణయించుకున్నారు. ఫలితంగా, ఒక్కో సినిమా సగటు రెమ్యునరేషన్ 200 కోట్లు అయినా.. 5 సినిమాలకూ కలిపితే విజయ్ మిస్ చేసుకున్న మొత్తం ఆదాయం 1000 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు లెక్క వేస్తున్నాయి.

ఇది కేవలం రెమ్యునరేషన్ మాత్రమే. విజయ్ ఆ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల ద్వారా ఇంకెంత పేరు, మార్కెట్ పెరిగేదో అనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "ఇంకా ఐదేళ్లు నటించేవాడైతే విజయ్ తెలుగు, హిందీ, కన్నడ మార్కెట్లలోనూ తన స్థాయిని పెంచుకునేవాడు" అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మిగతా స్టార్ హీరోలు ఒక్కో సంవత్సరం రెండు సినిమాలు చేస్తే విజయ్ అలాంటి స్థాయిలో మల్టీ లాంగ్వేజ్ మార్కెట్‌ను హిట్ చేయగలడని నమ్మకంగా చెబుతున్నారు. కానీ ఆయన రాజకీయ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల, భారీ అవకాశాలను వదులుకున్నారన్నది ఫ్యాన్స్ మధ్య ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మరి పాలిటిక్స్ లో విజయ్ కు ఎలాంటి గుర్తింపు అందుతుందో చూడాలి.