ఆ స్టార్ హీరో హంటింగ్ అన్ని చోట్లా ఒకేలా!
విజయ్ ఫోజులు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని పోలి ఉండటం వంటివి అంతకంతకు హైప్ తీసు కొస్తున్నాయి.
By: Tupaki Desk | 30 May 2025 3:00 AM ISTదళపతి విజయ్ కథానాయకుడిగా హెచ్. వినోద్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య `జననాయగన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. విజయ్ ఎన్నికల బరిలో నిలిచిన వేళ చేస్తోన్న తొలి పక్కా పొలిటిక్ థ్రిల్లర్ ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ కు చేరాయి. విజయ్ లుక్... అభిమానులతో సెల్పీలు దిగిన ఫోటోలు వంటివి పతాక స్థాయికి చేర్చాయి.
విజయ్ ఫోజులు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని పోలి ఉండటం వంటివి అంతకంతకు హైప్ తీసు కొస్తున్నాయి. దీంతో విజయ్ పాత్ర ఎలా ఉండబోతుంది? అన్న దానిపై అంచనాలు పెరిగిపో తున్నాయి. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని నిర్మిస్తుంది. విజయ్ చివరి చిత్రం ఇదే కావడం తో గొప్ప విజయాన్ని అందించి గ్రాండ్ గాప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలని సదరు సంస్థ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో సినిమాకు పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతున్నట్లు ఇప్పటికే మీడియా కథనాలు వైరల్ అవు తున్నాయి. ఓవర్సీస్ లో 75 కోట్లకు భారీ బిజినెస్ జరిగినట్లు వినిపిస్తుంది. అలాగే తెలుగులోనూ ఈ సినిమాకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో ఈ సినిమా బిజినెస్ ఒక్క తెలుగు నుంచే భారీ ఎత్తున ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు -సన్ టీవీ మధ్య భారీ శాటిలైట్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.
55 కోట్లకు సన్ నెట్ వర్క్ రైట్స్ దక్కించుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కోలీవుడ్ లో ఇదే హాయ్యెస్ట్ శాటిలైట్ డీల్ గా తెరపైకి వస్తోంది. ఇంత వరకూ ఏ సినిమాకు శాటిలైట్ పరంగా 50 కోట్ల డీల్ జరగలేదని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే విజయ్ హంటింగ్ రిలీజ్ కు ముందు నుంచే మొదలై నట్లు కనిపిస్తుంది.
