Begin typing your search above and press return to search.

లేటెస్ట్ లీక్‌ల‌తో ద‌ళ‌ప‌తి మూవీ సీక్రెట్ బ‌య‌ట‌ప‌డిందా?

ఇప్ప‌టికే కొంత క్యాడ‌ర్‌ను సిద్ధం చేసుకున్న విజ‌య్ ప్ర‌స్తుతం త‌న చివ‌రి మూవీలో న‌టిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   12 May 2025 4:30 PM
లేటెస్ట్ లీక్‌ల‌తో ద‌ళ‌ప‌తి మూవీ సీక్రెట్ బ‌య‌ట‌ప‌డిందా?
X

త‌మిళ క్రేజీ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్‌`. ఖాకీ, నేర్కొండ పార్వై, వ‌లిమై, తునీవు వంటి భారీ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హెచ్‌. వినోద్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌మిళ‌గ వెట్రి క‌ల‌గం పేరుతో హీరో విజ‌య్ పార్టీని స్థాపించి క్రియాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. ఇక‌పై రాజ‌కీయాల్లో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పార్టీని బ‌లోపేతం చేసి బ‌రిలోకి దిగాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇప్ప‌టికే కొంత క్యాడ‌ర్‌ను సిద్ధం చేసుకున్న విజ‌య్ ప్ర‌స్తుతం త‌న చివ‌రి మూవీలో న‌టిస్తున్నాడు. రిలీజ్‌కు ముందే ఈ మూవీ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. ఇప్ప‌టికే నాన్ థియేట్రిక‌ల్ (ఓటీటీ రైట్స్‌) ప‌రంగా రికార్డులు సృష్టించి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచింది. ఈ మూవీ నాన్ థియేట్రిక‌ల్ రైట్స్‌ని ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ బారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ సినిమా త‌మిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, కన్న‌డ ఓటీటీ హ‌క్కుల్ని ఆమెజాన్ రూ.121 కోట్ల‌కు ద‌క్కించుకుంద‌ని తెలిసింది. ఈ స్థాయిలో సినిమా రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ ఫినిష్ కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉంటే ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, `యానిమ‌ల్‌`తో లైన్‌లోకొచ్చిన బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా నటిస్తున్నారు. అంతే కాకుండా శృతిహాస‌న్‌, ప్రియ‌మ‌ణి, `ప్రేమ‌లు` ఫేమ్ మ‌మితా బైజు, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ న‌టిస్తున్న చివ‌రి సినిమా కావ‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై స‌ర్వ‌త్రా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే సినిమాని తెర‌పైకి తీసుకొస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన సీక్రెట్ ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది.

మొద‌టి నుంచి ఈ సినిమాని తెలుగు హిట్ ఫిల్మ్ `భ‌గ‌వంత్ కేస‌రి` ఆధారంగా విజ‌య్ స్టార్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టుగా మార్పులు చేసి తెర‌కెక్కిస్తున్నార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఆ వార్త‌ల‌ని నిజం చేస్తూ తాజాగా విజ‌య్‌కి సంబంధించిన పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూ `జ‌న నాయ‌గ‌న్‌` సీక్రెట్‌ని బ‌య‌ట‌పెట్టేసింది. `భ‌గ‌వంత్ కేస‌రి`లో బాల‌య్య పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించడం తెలిసిందే. అదే త‌ర‌హాలో విజ‌య్ కూడా ఈ మూవీలో పోలీస్ అధికారిక‌గా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఆ విష‌యాన్ని తాజాగా లీక్ అయిన విజ‌య్ ఫొటోలు క్లారిటీ ఇచ్చేశాయి. దీంతో విజ‌య్ తెలుగు రీమేక్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడ‌ని తేలిపోయింది. కాగా ఈ మూవీని భారీ స్థాయిలో 2026 జ‌న‌వ‌రి 9న రిలీజ్ చేయ‌బోతున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో బిజిఎమ్స్ ఓ రేంజ్‌లో ఉండ‌నున్నాయ‌ని ఇన్ సైడ్ టాక్‌.