విజయ్ స్టైలిష్‌గా.. మరింత పవర్‌ఫుల్‌గా
చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరో తిరిగి పోలీస్ పాత్ర చేస్తుండటం, దానికి తోడు ఇందులో విజయ్ స్టైలిష్ గా కూడా కనిపిస్తుండటంతో జన నాయగన్ లుక్ కు ఆడియన్స్ నుంచి భారీ ఎత్తున ప్రశంసలొస్తున్నాయి.
By: Tupaki Desk | 22 Jun 2025 6:53 PM ISTతమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా జన నాయగన్. ఆదివారం విజయ్ బర్త్ డే సందర్భంగా అర్థరాత్రి చిత్ర యూనిట్ జన నాయగన్ నుంచి ఫస్ట్ రోర్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేయగా, ఆ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అర్థరాత్రి రిలీజైన టీజర్, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
విజయ్ ను డైరెక్టర్ వినోత్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ గెటప్ లో చూపించాడు. టీజర్ తోనే ఫ్యాన్స్ ఫుల్ ఆనందంతో కేరింతలు కొడుతుంటే ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలని సినిమా నుంచి విజయ్ పోలీస్ లుక్ లో ఉన్న ఓ సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లో లాగానే విజయ్ ఈ పోస్టర్ లో కూడా చాలా పవర్‌ఫుల్ గా కనిపిస్తున్నాడు.
చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరో తిరిగి పోలీస్ పాత్ర చేస్తుండటం, దానికి తోడు ఇందులో విజయ్ స్టైలిష్ గా కూడా కనిపిస్తుండటంతో జన నాయగన్ లుక్ కు ఆడియన్స్ నుంచి భారీ ఎత్తున ప్రశంసలొస్తున్నాయి. ఈ సినిమాను దేశ వ్యాప్తంగా ఒకేసారి, ఒకే టైటిల్ తో రిలీజ్ చేయాలనే ఆలోచనతో సినిమాకు జన నాయగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.
వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందుతున్న జన నాయగన్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, విజయ్ రాజకీయాల్లోకి వెళ్లబోతూ చేస్తున్న ఆఖరి సినిమాగా ఇది తెరకెక్కుతుంది. విజయ్ నుంచి రాబోతున్న ఆఖరి సినిమా కావడంతో జన నాయగన్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి.
