విజయ్ ఎలా ఆ లాజిక్‌ని మిస్సయ్యాడు?
దళపతి విజయ్ నటించిన చివరి మూవీ `జన నాయగన్`. రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి సినిమాలకు గుడ్ బై చెప్పడానికి విజయ్ అన్ని రకాలుగా సిద్ధమైన నేపథ్యంలో చేసిన సినిమా ఇది.
By: Tupaki Desk | 4 Jan 2026 1:14 PM ISTదళపతి విజయ్ నటించిన చివరి మూవీ `జన నాయగన్`. రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి సినిమాలకు గుడ్ బై చెప్పడానికి విజయ్ అన్ని రకాలుగా సిద్ధమైన నేపథ్యంలో చేసిన సినిమా ఇది. `ఖాకీ`, నేర్కొండ పార్వై, వలిమై వంటి సినిమాలు అందించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న హెచ్. వినోద్ డైరెక్టర్. విజయ్ రాజకీయ అరంభానికి దిగుతున్న తరుణంలో విడుదలవుతున్న ఈ సినిమాపై సహజంగానే అందిరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ట్రైలర్ రిలీజ్‌తో అందరి డౌట్‌లకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
ముందు నుంచి ఇది నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో రూపొందిన `భగవంత్ కేసరి`కి రీమేక్ అని ప్రచారం జరగుతూ వస్తోంది. అయితే దీనిపై దర్శకుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సరికదా, ఇది పూర్తిగా విజయ్ సినిమా అంటూ గొప్పలు చెప్పాడు. అనిల్ రావిపూడి కూడా తెలిసే ఈ విషయాన్ని దాచి హెచ్. వినోద్ తరహాలోనే స్పందించాడు. ఒక విధంగా ట్రైలర్ రిలీజ్ వరకు హైడెన్సిక్ గేమ్ ఆడారు. అయితే ట్రైలర్‌తో ఇది `భగవంత్ కేసరి` రీమేక్ అని క్లారిటీ వచ్చేసింది. అయితే సగం మాత్రమే దీని నుంచి తీసుకున్నారని స్పష్టమైంది.
ప్రస్తుతం రీమేక్ సినిమాలంటే ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ విషయం తెలిసి కూడా మెగాస్టార్ `లూసీఫర్`ని `గాడ్ ఫాదర్`గా రిమేక్ చేయించి చేతులు కాల్చుకున్నారు. `జన నాయగన్` విషయంలోనూ ఇదే మిస్టేక్ జరిగినట్టుగా కనిపిస్తోంది. `భగవంత్ కేసరి` స్టోరీని యదా తదంగా తీసుకున్నా కొంత వరకు బాగుండేదేమో..బాలయ్య క్యారెక్టర్‌ని విజయ్ ఎంత స్టైలిష్‌గా చేశాడా? అని ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా చూసేవారేమో?.. కానీ ఈ రీమేక్ విషయంలో అది జరగలేదు.
`భగవంత్ కేసరి` కథని సగం వరకు మాత్రమే తీసుకుని మిగతా సగం కొత్తగా రాసుకున్నారు. దీంతో `జన నాయగన్` సగం వండి వదిలేసిన వంటగా మారే అవకాశం కనిపిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ కానీ, విజయ్ మెరుపులు కానీ, వినోద్ టేకింగ్ గానీ చాలా ప్రెడిక్టెబుల్‌గా ఉంది. ట్రైలర్ చూసిన తరువాత విజయ్ అభిమానులు కూడా అంటున్న మాట దళపతి ఏరి కోరి చివరి సినిమా కోసం ఇలాంటి మిస్టేక్ ఎందుకు చేశాడు? అని. ఓ స్టార్ హీరో సినిమాలకు గుడ్‌బై చెబుతున్న వేళ ప్రేక్షకులు, ఓటీటీ లవర్స్ చూసి అరిగిపోయిన కథని రీమేక్‌గా ఎంచుకోవడం ఏంటని, ఇంత బ్లండర్ మిస్టేక్‌ని విజయ్ ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని అభిమానులు వాపోతున్నారట.
విజయ్ తలుచుకుంటే స్టార్ డైరెక్టర్లు క్యూ కడతారు. కొత్త కొత్త కథలని సిద్ధం చేసి విజయ్‌ని మరింత పవర్‌ఫుల్గా ప్రజెంట్ చేస్తారు. ఆ విషయాన్ని విజయ్ ఎందుకు మర్చిపోయాడు?.. ఎలా ఆ లాజిక్‌ని మిస్సయ్యాడు? అని ట్రైలర్ చూసిన అభిమానులు, సినీ లవర్స్ లబోదిబో మంటున్నారు. ఫేర్‌వెల్ మూవీ మెమరబుల్ గా ఉంటాలని భావిస్తే ఇలాంటి రీమేక్‌ని ఎంచుకుని దళపతి షాక్ ఇచ్చాడని, ఇది అస్సలు ఊహించలేదని, ఈ విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని అభిమానులు నెట్టింట ఫీలవుతున్నారట.
