ఒక్క సీన్ కోసం విజయ్ మూవీ టీమ్ అంత ఖర్చు పెట్టిందా?
అయితే తాజా సమాచారం ప్రకారం జన నాయగన్, భగవంత్ కేసరి రీమేక్ కాదని, ఇదొక కొత్త కథ అని తెలుస్తోంది.
By: Tupaki Desk | 21 May 2025 12:38 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం తన ఆఖరి సినిమాను చేస్తున్నాడు. హెచ్.వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. జన నాయగన్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. జన నాయగన్ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే విజయ్ కెరీర్ లో లాస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ జన నాయగన్ నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ భగవంత్ కేసరికి రీమేక్ అని వార్తలొచ్చాయి. అందులో భాగంగానే మేకర్స్ ఈ సినిమా రైట్స్ ను కూడా కొనుక్కున్నారనే ఇన్ఫర్మేషన్ అఫీషియల్ గానే వచ్చింది. జన నాయగన్ కోసం భగవంత్ కేసరి రీమేక్ రైట్స్ ను సుమారు నాలుగున్నర కోట్లు ఖర్చు పెట్టి మరీ కొనుక్కున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం జన నాయగన్, భగవంత్ కేసరి రీమేక్ కాదని, ఇదొక కొత్త కథ అని తెలుస్తోంది. భగవంత్ కేసరిలోని ఒక్క సీన్ ను రీమేక్ చేయడానికి మాత్రమే జన నాయగన్ టీమ్ ఆ రైట్స్ ను కొనుక్కుందని సమాచారం. భగవంత్ కేసరిలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే మంచి ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ ను మాత్రమే జన నాయగన్ టీమ్ రీమేక్ చేయనుందట.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సీన్ తప్ప ఏ ఒక్క సీన్ ను భగవంత్ కేసరి నుంచి జన నాయగన్ కోసం తీసుకోవడం లేదని, జన నాయగన్ కథ, స్క్రీన్ ప్లే మొత్తం పూర్తి భిన్నంగా ఉంటాయని, అసలు బాలయ్య భగవంత్ కేసరికి, విజయ్ జన నాయగన్ కు సంబంధముండదని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే కేవలం ఆ ఒక్క సీన్ రీమేక్ కోసం జన నాయగన్ టీమ్ నాలుగున్నర కోట్లు ఖర్చు పెట్టినట్టు అవుతుంది.
అలాంటి మంచి సీన్స్ సినిమాలో ఉంటే తమిళనాడు ఎలక్షన్స్ కు ముందు వచ్చే తన ఆఖరి సినిమా మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని, పొలిటికల్ గా కూడా తనకు బాగా కలిసొస్తుందని విజయ్ నమ్ముతున్నట్టు తెలుస్తోంది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు భామ మమిత బైజు ఓ కీలక పాత్రలో నటిస్తోంది. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ కు భారీ అంచనాలున్నాయి.
