Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కోసం స్పీక‌ర్ మోసిన స్టార్ హీరో!

కార్తితో `ఖాకీ`, అజిత్‌తో నేర్కొండ పార్వై, వ‌లిమై వంటి హిట్ సినిమాల‌ని రూపొందించి ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న హెచ్‌.వినోద్ ఈ మూవీని రూపొందిస్తున్నాడు

By:  Tupaki Desk   |   26 Dec 2025 8:17 PM IST
ఫ్యాన్స్ కోసం స్పీక‌ర్ మోసిన స్టార్ హీరో!
X

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ `జ‌న నాయ‌గ‌న్‌`. కార్తితో `ఖాకీ`, అజిత్‌తో నేర్కొండ పార్వై, వ‌లిమై వంటి హిట్ సినిమాల‌ని రూపొందించి ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న హెచ్‌.వినోద్ ఈ మూవీని రూపొందిస్తున్నాడు. బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో `ప్రేమ‌లు` ఫేమ్ మ‌మిత బైజు, ప్రియ‌మ‌ణి, రెబా మోనిక‌, బాబి డియోల్‌, ప్ర‌కాష్ రాజ్‌, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, న‌రేన్ న‌టిస్తున్నారు. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 9న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

సినిమా రిలీజ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌ని మొద‌లుపెట్టారు. డిసెంబ‌ర్ 27న మ‌లేసియాలోని కౌలాలంపూర్‌లో ప్ర‌త్యేకంగా భారీ స్థాయిలో ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్‌ని నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందు కోసం భారీ స్థాయిలో అభిమానులు కౌలాలంపూర్‌కు చేరుకుంటున్నారు. చెన్నై నుంచి బ‌య‌లుదేరిన ఓ ఫ్లైట్ మొత్తం అభిమానుల‌తో నిండిపోవ‌డం విజ‌య్ క్రేజ్‌ని తెలియ‌జేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే హీరో విజ‌య్ శుక్ర‌వారం మ‌లేసియా చేరుకున్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌, టీమ్ మెంబ‌ర్స్‌తో క‌లిసి విజ‌య్ మ‌లేసియా ఏయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. త‌ను వ‌స్తున్నాడ‌ని అక్క‌డి అభిమానులు ప్ర‌త్యేకంగా స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు చేశారు. మ‌లేసియ‌న్ ట్రెడిష‌న‌ల్ డ్యాన్స్‌, మార్ష‌ల్ ఆర్ట్స్‌ని ప్ర‌ద‌ర్శిస్తూ ఫ్యాన్స్ ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి ప్ర‌త్యేకంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా హీరో విజ‌య్ చేసిన ప‌ని ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

అభిమానులు స్వాగ‌తం ప‌లుకుతున్న సంద‌ర్భంగా అక్క‌డ ఓ బ్లాటేత్ స్పీక‌ర్‌ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా అభిమానుల ఉత్సాహానికి స‌ర్‌ప్రైజ్ అయిన హీరో విజ‌య్ వారు పెర్ఫామ్ చేస్తున్న స‌మ‌యంలో ప‌క్క‌న పెట్టిన బ్లూ టూత్ స్పీక‌ర్‌ని కొంత సేపు ప‌ట్టుకుని మోయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే శుక్ర‌వారం కౌలాలంపూర్‌లో జ‌రిగే ఆడియో లాంచ్‌ ఈవెంట్ లో దాదాపు 90 వేల మంది విజ‌య్ అభిమానులు పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇదే విజ‌య్ చివ‌రి సినిమా అంటూప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో `జ‌న నాయ‌గ‌న్‌`పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. విజ‌య్ న‌టిస్తున్న ఈ మూవీని తెలుగు హిట్ ఫిల్మ్ `భ‌గ‌వంత్ కేస‌రి` ఆధారంగా తెర‌కెక్కిస్తున్నార‌ని, త‌మిళ నేటివిటీకి, విజ‌య్ క్రేజ్‌కి త‌గ్గ‌ట్టుగా ప‌లు మార్పులు చేసి ఈ మూవీని చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.