దళపతి గర్జనకు ముహూర్తం ఫిక్స్..!
దళపతి విజయ్ హీరోగా హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా జన నాయగన్.
By: Tupaki Desk | 20 Jun 2025 11:54 PM ISTదళపతి విజయ్ హీరోగా హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా జన నాయగన్. కె.వి.ఎన్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ లాక్ చేశారు. దళపతి విజయ్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు కూడా నటిస్తుంది. దళపతి విజయ్ జన నాయగన్ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ రోర్ ఈ నెల 22న 12 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెబుతూ ఫైనల్ గా చేస్తున్న సినిమా అవడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చివరి సినిమాగా వస్తున్న జన నాయగన్ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. జన నాయగన్ సినిమాను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
విజయ్ పొలిటికల్ జర్నీకి కూడా ఉపయోగపడేలా కూడా సినిమాను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తుంది. దళపతి విజయ్ జన నాయగన్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. సినిమా ఫస్ట్ రోర్ గా టీజర్ ని వదలనున్నారు. ఈ టీజర్ తోనే సినిమాపై ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు. విజయ్ లాస్ట్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ కి కావాల్సిన ఫీస్ట్ ఇచ్చేలా సినిమా ఉంటుందని అంటున్నారు.
ఐతే సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ షో కూడా ఎట్రాక్ట్ చేసేలా డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడట. సినిమా రిలీజ్ కు ఎలాగు మరో ఆరు నెలలు టైం ఉంది కాబట్టి చాలా ఫోకస్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. దళపతి విజయ్ చివరి సినిమాగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా సినిమాను ప్లాన్ చేస్తున్నారట. 2026 పొంగల్ రేసులో రిలీజ్ అవుతున్న ఈ సినిమా భారీ రికార్డులను టార్గెట్ పెట్టుకుంది.
విజయ్ జన నాయగన్ సినిమా బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా కథ స్పూర్తితో తెరకెక్కుతుందని టాక్. ఐతే ఈ విషయంపై అటు జన నాయగన్ మేకర్స్ కానీ భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన వారు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. మూల కథను తీసుకుని అక్కడ ఆడియన్స్ కు తగినట్టుగా జన నాయగన్ ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.
