Begin typing your search above and press return to search.

విజ‌య్ ఎంట్రీపై న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఆయ‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఎలా ఉంటుంది? అని ఎవ‌రూ గెస్ చేసి చెప్పింది లేదు గానీ ప‌రిశ్ర‌మ నుంచి సానుకూలంగా స్పందించారు

By:  Tupaki Desk   |   27 Feb 2024 6:28 AM GMT
విజ‌య్ ఎంట్రీపై న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X

త‌ల‌ప‌తి విజ‌య్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీ స్థాపించి 2026 ఎన్నిక‌ల‌కు శ‌మ‌ర శంఖం పూరించారు. విజ‌య్ తెరంగేట్రంతో అభిమానులు ఆనందానికి అవ‌దుల్లేవ్. అదే స‌మ‌యంలో సినిమాలు మిస్ అవుతాం? అన్న ఆవేద‌న అభిమానుల్లో క‌నిపిస్తుంది. ఇక విజ‌య్ ఎంట్రీపై రాజ‌కీయ విశ్లేష‌కులు ఎవ‌రి అభిప్రాయాలు వారు పంచుకుంటున్నారు. విజయ్ పార్టీ లాంచ్ చేసిన అనంత‌రం ప‌రిశ్ర‌మ త‌రుపున అంతా విషెస్ తెలియ‌జేసారు.

ఆయ‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఎలా ఉంటుంది? అని ఎవ‌రూ గెస్ చేసి చెప్పింది లేదు గానీ ప‌రిశ్ర‌మ నుంచి సానుకూలంగా స్పందించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా విజయ్ పొలిటికల్ ఎంట్రీపై సినీ నటుడు రంజిత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజయ్ అధికార దాహంతోనే విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఆరోపించారు. విజయ్ లాంటి వాళ్లు వెయ్యి మంది వచ్చినా తమిళనాడులో ఎలాంటి మార్పు తీసుకు రాలేని అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. ఇప్ప‌టిక‌ప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఆయ‌న ఎలాంటి మార్పు తీసుకొద్దాం అనుకుంటున్నారు? అని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

ఓటుకు 10 వేలు..12 వేల వ‌ర‌కూ డ‌బ్బులు పంచే వారిని ప్ర‌జ‌లు గెలిపించకూడ‌ద‌ని రంజిత్ కోరారు. అలాగే రాష్ట్రంలో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో స్వ‌లాభం కోసం కొంద‌రు పార్టీలు మారుతుంటార‌ని.. దీనికి విజ‌య‌ధ‌ర‌ణి మంచి ఉదాహ‌ర‌ణ అన్నారు. ప్ర‌భుత్వం కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ప్ర‌తీసారి మ‌ద్యం అమ్మ‌కాలు త‌గ్గిస్తామ‌ని చెబుతారు. కానీ ఆ దందా ప్ర‌తీ ప్ర‌భుత్వం య‌ధేశ్చ‌గా కొన‌సాగిస్తూనే ఉంది.

రాబోయే కొత్త ప్ర‌భుత్వాలు త‌గ్గించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటాయా? ఈ అంశాన్ని మ్యానిఫెస్టో లో పెట్టి ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళ్లి సాధించ‌గ‌ల‌రా? అని స‌వాల్ విసిరారు. ఎన్నిక‌ల్ని మాత్రం ఎవ‌రూ బ‌హిష్క రించ‌కుండా అంతా త‌ప్ప‌న‌సిరిగా ఓటు హ‌క్కుని వినియోగించుకోవాల‌ని కోరారు. విజ‌య్ పై చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. విజ‌య్ అభిమానులు రంజిత్ వ్యాఖ్య‌ల్ని తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.