రజినీ కోసం అతడికి రూ.10 కోట్లు ఇస్తున్న కమల్?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కబోయే (Thalaivar173) ప్రాజెక్టుపై అటు సినీ ప్రియుల్లో.. ఇటు అభిమానుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 26 Nov 2025 4:00 PM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కబోయే (Thalaivar173) ప్రాజెక్టుపై అటు సినీ ప్రియుల్లో.. ఇటు అభిమానుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో అత్యంత అరుదైన కాంబినేషన్ గా నిలిచే ఆ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఆ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాగా.. దర్శకుడిగా సి. సుందర్ ను ప్రకటించారు. కానీ ఆయన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అనుకోని పరిస్థితులు కారణంగా తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు. రజినీ కాంత్, కమల్ హాసన్ అభిమానులకు కలిగిన నిరాశకు నిజమైన క్షమాపణలు అంటూ లెటర్ విడుదల చేశారు.
దర్శకత్వ బాధ్యతల నుంచి సుందర్ తప్పుకున్న తర్వాత రజినీ- కమల్ ప్రాజెక్ట్ కు కొత్త డైరెక్టర్ ఎవరు అన్న విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. మొదట్లో లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ పేర్లు వినిపించగా.. ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రీసెంట్ గా పార్కింగ్ మూవీ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణ పేరు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది.
రామ్ కుమార్ బాలకృష్ణన్ నెరేట్ చేసిన స్టోరీ.. అటు రజినీకి.. ఇటు కమల్ కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో యంగ్ డైరెక్టర్ కు ఇంత పెద్ద అవకాశం దక్కడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు ఆ డైరెక్టర్ రెమ్యూనరేషన్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
రామ్ కుమార్ బాలకృష్ణన్ కు రూ.10 కోట్లు ఇవ్వనున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన పార్కింగ్ మూవీకి గాను కేవలం రూ.6 లక్షల పారితోషికం తీసుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో వర్క్ చేస్తున్నారు. ఆ సినిమాకు రూ.2 కోట్లు తీసుకుంటున్నారు.
కానీ ఇప్పుడు రజినీ- కమల్ మూవీకి ఏకంగా రూ.10 కోట్లు అందుకోనున్నారని తెలుస్తోంది. దీంతో తక్కువ టైమ్ లోనే అంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోనుండడం గమనార్హం. రెండేళ్లలోనే రూ.6 లక్షల రేంజ్ నుంచి రూ.10 కోట్ల రేంజ్ కు చేరుకున్నారని చెప్పాలి. అయితే ఆ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. బాలకృష్ణన్ కూడా ఎక్కడా ఇప్పటి వరకు కమల్, రజినీ మూవీకి వర్క్ చేస్తున్నట్లు రివీల్ చేయలేదు.
