Begin typing your search above and press return to search.

తలైవర్ 171 : ర‌జ‌నీ (Vs) రానా

భ‌ళ్లాల దేవుడిగా మెప్పించిన ద‌గ్గుబాటి రానా ఈ చిత్రంలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న విలన్‌గా విభిన్న‌మైన పాత్ర‌లో నటిస్తున్నట్లు తెలిసింది.

By:  Tupaki Desk   |   16 April 2024 1:30 AM GMT
తలైవర్ 171 : ర‌జ‌నీ (Vs) రానా
X

బాహుబ‌లి చిత్రంలో ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టించ‌గా, ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న భ‌ళ్లాల దేవ పాత్ర‌లో ద‌గ్గుబాటి రానా న‌టించాడు. న‌టుడిగా త‌న‌కు గొప్ప పేరు వచ్చింది. ప్ర‌భాస్ తో ఢీకొట్టేలా రానా పాత్ర‌ను రాజ‌మౌళి ఒక రేంజులో ఎలివేట్ చేసారు. కానీ ఇప్పుడు త‌లైవ‌ర్ 170లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ను ధీటుగా ఢీకొట్టే విల‌న్ గా ద‌గ్గుబాటి రానాను చూపిస్తున్నారా? అంటే... అవున‌నే ఊహాగానాలు సాగుతున్నాయి. వివ‌రాల్లోకి వెళితే..

సూప‌ర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'వెట్టయన్' సినిమా షూటింగ్‌లో ఉన్నారు. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక మల్టీస్టారర్ కం పాన్-ఇండియా ప్రాజెక్ట్. ఇందులో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, దుషార విజయన్, రితికా సింగ్, మంజు వారియర్, రానా వంటి ప్ర‌తిభావంతులైన స్టార్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంగీతం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు..రానా దగ్గుబాటి ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. భ‌ళ్లాల దేవుడిగా మెప్పించిన ద‌గ్గుబాటి రానా ఈ చిత్రంలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న విలన్‌గా విభిన్న‌మైన పాత్ర‌లో నటిస్తున్నట్లు తెలిసింది. ల్యాప్‌టాప్‌లను బగ్ చేయడంలో నైపుణ్యం ఉన్న టెక్నీషియ‌న్‌గా క్రిమిన‌ల్ గా రానా న‌టిస్తున్నాడు. అయితే అత‌డి పాత్ర షాడో త‌ర‌హాలో నెమ్మ‌దిగా రివీల‌వుతుంది. ఈ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది.

ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో క్రైమ్ ఎలా ప్రబలుతుంది? అనే దానిపై ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో భారీ స్క్రీన్‌లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. ర‌జ‌నీ వ‌ర్సెస్ రానా ఎపిసోడ్స్ ఆస‌క్తిని క‌లిగిస్తాయ‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత, రజనీకాంత్ తదుపరి చిత్రం 'తలైవర్ 171' లోకేశ్ కనగరాజ్‌తో ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.