Begin typing your search above and press return to search.

భారీ కాస్ట్ తో తలైవర్ 170.. 32ఏళ్ల తర్వాత మళ్లీ అలా

తలైవర్ 170గా(వర్కింగ్ టైటిల్) రాబోతున్న ఈ సినిమాకు 'జై భీమ్' ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు.

By:  Tupaki Desk   |   4 Aug 2023 5:30 PM GMT
భారీ కాస్ట్ తో తలైవర్ 170.. 32ఏళ్ల తర్వాత మళ్లీ అలా
X

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడు పదల వయసులోనూ ఇంకా జోరు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన నటించిన కొత్త సినిమా 'జైలర్' రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

అయితే అప్పుడే రజనీకాంత్ తన కొత్త సినిమాకు సంబంధించిన పనులను ప్రారంభించేశారు. తలైవర్ 170గా(వర్కింగ్ టైటిల్) రాబోతున్న ఈ సినిమాకు 'జై భీమ్' ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రజనీకి సంబంధించిన లుక్ టెస్టు కూడా జరిగినట్లు తెలిసింది.

ఇక ఈ సినిమాలోనూ భారీ కాస్ట్ ఉండేలా సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని తెలిసింది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం అందింది.

ఇప్పటికే వీరిద్దరతో చర్చలు జరుగుతున్నాయని, దాదాపు కన్ఫామ్ అయినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

కాగా, అమితాబ్ - రజనీ కలిసి నటించేది నిజమైతే కనుక.. దాదాపు 32ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించినట్టవుతుంది. వీరిద్దరు గతంలో కలిసి 'హమ్', 'గిరఫ్ తార్' సహా మరో చిత్రంలో కలిసి నటించి ఆడియెన్స్ ను అలరించారు. అవి అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచాయి.

ఇకపోతే రజనీ జైలర్ చిత్రంతో పాటు.. తన కూతురు దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. మొయిద్దీన్ అనే భాయ్‍ పాత్ర పోషించారు రజినీ. విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయింది. త్వరలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కానుంది.