Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్: త‌ళా అజిత్ Vs యాక్షన్ కింగ్ అర్జున్

ఇక ఈ మూవీలో త‌ళా అజిత్ వ‌ర్సెస్ అర్జున్ ఎపిసోడ్స్ ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   26 Aug 2023 7:24 PM GMT
ఇంట్రెస్టింగ్: త‌ళా అజిత్ Vs యాక్షన్ కింగ్ అర్జున్
X

త‌ళా అజిత్ తదుపరి చిత్రాన్ని 'చంద్రముఖి 2' మేకర్స్ నిర్మిస్తారని ఇంత‌కుముందు ప్ర‌క‌ట‌న వెలువడింది. అజిత్ పుట్టినరోజు సందర్భంగా మేలో అధికారికంగా సినిమా ప్రారంభ‌మైంది. 'విదాముయార్చి' అనే టైటిల్‌ని కూడా ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించ‌నున్నారు. అయితే ప్ర‌క‌టించి ఇంత‌కాలం అయినా కానీ షూటింగ్ ప్రారంభం కాకపోవడం.. సినిమా గురించి ఎటువంటి అధికారిక అప్‌డేట్ లేకపోవడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింద‌ని వార్తలు వచ్చాయి.

కానీ 'చంద్రముఖి 2' ఆడియో లాంచ్‌లో అజిత్ సినిమా ఆగిపోలేద‌ని నిర్మాత‌లు స్ప‌ష్ఠ‌త‌నిచ్చారు. అజిత్ తో 'విదాముయార్చి'ని తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా అభివర్ణించారు. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా తెలిపారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఎట్టకేలకు 'విదాముయార్చి' గురించి అధికారిక ప్ర‌క‌ట‌న‌ రావడంతో అభిమానులు హ్యాపీ ఫీల‌వుతున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా కేట‌గిరీలో రికార్డులు కొట్టాలని త‌ళా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

'విదాముయార్చి' తారాగణం సాంకేతిక బృందం గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం.. తమన్నా - త్రిష క‌థ‌నాయిక‌లుగా న‌టించే వీలుంది. యాక్ష‌న్ కింగ్ అర్జున్ - అర్జున్ దాస్ విలన్‌లుగా నటించనున్నట్లు టీమ్ పేర్కొంది.

ఇక ఈ మూవీలో త‌ళా అజిత్ వ‌ర్సెస్ అర్జున్ ఎపిసోడ్స్ ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారని వేదాళం-వివేగం తర్వాత అజిత్‌తో అనిరుధ్ కి ఇది మూడో సినిమా అని తెలిసింది.

ప్రపంచ మోటర్ టూర్‌పై దృష్టి సారించిన అజిత్ కొద్ది రోజుల క్రితం చెన్నైకి తిరిగి వచ్చాడు. అజిత్ తిరిగి రావడంతో సినిమా షూటింగ్ అనుకున్నదానికంటే ముందే ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయ‌నే సంకేతాలు వెలువ‌డ్డాయి. వ్య‌క్తిగ‌త ఆస‌క్తుల‌కు గండి కొట్ట‌కుండా వాటిని నెర‌వేర్చుకుంటూనే అజిత్ సినిమాల్లో న‌టిస్తున్నారు.