Begin typing your search above and press return to search.

24 ఏళ్ల నటి మృతి.. ఆ వ్యాఖ్యలు కారణమా?

ఇటీవల అడల్ట్ సినిమా నటిగా పేరు దక్కించుకున్న థైనా ఫీల్డ్స్ తాను కెరీర్‌ ఆరంభించినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.

By:  Tupaki Desk   |   13 Dec 2023 12:30 AM GMT
24 ఏళ్ల నటి మృతి.. ఆ వ్యాఖ్యలు కారణమా?
X

సాధారణంగా హీరోయిన్స్ లైంగిక వేధింపులు ఎదుర్కొంటారు అనేది అందరికీ తెల్సిన విషయం. అయితే ఆ విషయాన్ని చాలా మంది బయటకు చెప్పరు. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులు బహిర్గతం చేస్తే ఆఫర్లు తగ్గుతాయి అనే భయంతో చాలా మంది మనసులోనే ఉంచుకుంటారు.

ఈ మధ్య కాలంలో కొందరు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులు మీడియా ముందుకు వచ్చి చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. మీటూ అనే ఉద్యమం సమయంలో చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమను లైంగికంగా హింసించిన వారి పేర్లను చెప్పడం జరిగింది.

ఇటీవల అడల్ట్ సినిమా నటిగా పేరు దక్కించుకున్న థైనా ఫీల్డ్స్ తాను కెరీర్‌ ఆరంభించినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తాను అడల్ట్ కంటెంట్ లో నటించడంతో తన తో కొందరు అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.

ఫీల్డ్స్‌ వర్క్ చేసిన నిర్మాణ సంస్థకు చెందిన ఒక వ్యక్తి తీవ్రంగా వేధించాడని వ్యాఖ్యలు చేసింది. ఫీల్డ్స్ ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని వారాలకే మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది అంటూ సోషల్ మీడియా ద్వారా ఆమెకు సంబంధించిన విషయాల గురించి చర్చ మొదలైంది.

ఇటీవల ఫీల్డ్స్ ఎవరి పై అయితే లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిందో వారే ఆమె ను చంపి ఉంటారేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ను అభిమానించే వారు, ఆమె తో వర్క్ చేసిన ప్రొడక్షన్ టీమ్‌ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్‌ లు పెట్టారు.