Begin typing your search above and press return to search.

హీరోయిన్ లో క‌రోనా తెచ్చిన మార్పు

ఆ సినిమా ఆశించి ఫ‌లితాన్నివ్వ‌న‌ప్ప‌టికీ అషికా న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి.

By:  Tupaki Desk   |   13 Dec 2023 3:30 PM GMT
హీరోయిన్ లో క‌రోనా తెచ్చిన మార్పు
X

టాలీవుడ్ లో క‌న్న‌డ భామ‌ల హ‌వా జోరందుకున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్పుడు ముంబై భామ‌ల హ‌వా క‌నిపించేది. కానీ ఇప్పుడు వాళ్ల క‌న్నా క‌న్న‌డిగుల‌కే టాలీవుడ్ పెద్ద పీట వేస్తుంది. క‌న్న‌డిగుల్లో నేచుర‌ల్ పెర్పార్మల‌ను వెతికి ప‌ట్టుకుంటున్నారు మేక‌ర్స్. దీంతో వాళ్లు ప‌రిశ్ర‌మ‌కి సెంటిమెంట్ గానూ మారు తున్నారు. ఆ జాబితాలో ఆషికా రంగ‌నాద్ కూడా ఉంది. 'అమిగోస్' తో అమ్మ‌డు తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఆశించి ఫ‌లితాన్నివ్వ‌న‌ప్ప‌టికీ అషికా న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి.

ప్ర‌స్తుతం నాగార్జున‌కు జోడీగా 'నా సామి రంగ‌'లో న‌టిస్తోంది. ఇంకా కొన్ని చిత్రాల్లోనూ అమ్మ‌డి పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అమ్మ‌డు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది ఆవి ఏంటో ఆమె మాట‌ల్లోనే... క‌రోనా స‌మ‌యంలో చాలా మంది మంచి కంటెంట్ ఉన్న ఏ సినిమాని వ‌దులుకోలేదు. క‌రోనాని నుంచి చాలా విష‌యాలు మారాయి. ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌లో కూడా అడుగు పెట్టారు. నేను కూడా అలా వ‌చ్చిన దాన్నే.

కెరీర్ ప‌రంగా ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌డానికైనా సిద్దంగా ఉన్నాను. న‌న్ను నేను కొత్త‌గా ఆవిష్క‌రిం చుకోవ‌డానికి.. కొత్త అనుభ‌వాల్ని పొంద‌డానికి ఆస‌క్తిగా ఉన్నాను. అమిగోస్ లో నా న‌ట‌న న‌చ్చే `నా సామిరంగ‌`లో అవ‌కాశం ఇచ్చారు. ఇక భాష ప‌రంగా ఇంకా చాలా విష‌యాలు తెలుసుకోవాలి. తెలుగు ప‌దాలు నేర్చుకుంటున్నాను. కొత్త భాష నేర్చుకునే ట‌ప్పుడు ఎంత ఎగ్జైట్ మెంట్ క‌లుగుతుందో? మాట‌ల్లో చెప్ప‌లేను` అని అంది.

అందం..అభిన‌యంతో అమ్మ‌డి కి ఇప్ప‌టికే టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించింది. స‌రైన విజ‌యాలు ప‌డితే ఆషికా ఫేమ‌స్ అవ్వ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌దు. ఆషికా గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు సైతం సై అనే సింది. ఆ ర‌కంగా మేక‌ర్స్ అమ్మ‌డి ప్ర‌తిభ‌ని గుర్తించి కొత్త త‌ర‌హా పాత్ర‌లు రాయ‌గ‌ల్గితే మ‌రింత ఫేమ‌స్ అవుతుంది.