Begin typing your search above and press return to search.

బ్రో ని యూఎస్ లో కొందరు టార్గెట్ చేశారు - నిర్మాత

బ్రో చిత్రాన్ని యూఎస్ లో ఓ కమ్యూనిటీ వారు నెగిటివ్ చేయాలని చూసారని సంచలన ఆరోపణలు చేశారు

By:  Tupaki Desk   |   21 July 2023 3:58 AM GMT
బ్రో ని యూఎస్ లో కొందరు టార్గెట్ చేశారు - నిర్మాత
X

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోన్న నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఉంది. చిన్న సినిమాలతో జర్నీ స్టార్ట్ చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన బ్రో మూవీని జులై 28న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు గట్టిగా ఉన్నాయి. సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్, తేజ్ హీరోలుగా బ్రో మూవీ తెరకెక్కింది.

దీంతో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో మూవీ కూడా చేస్తోంది. ఈ ప్రొడక్షన్ హౌస్ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో బ్రో సినిమా విశేషాలతో పాటుగా తన ఫిలిం కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బ్రో చిత్రాన్ని యూఎస్ లో ఓ కమ్యూనిటీ వారు నెగిటివ్ చేయాలని చూసారని సంచలన ఆరోపణలు చేశారు.

80 శాతం బాగున్న సినిమాలో ఒకటి, రెండు పాటలని తీసుకొని వాటిపై విషప్రచారం చేశారని అన్నారు. అయితే అలా చేసింది ఎవరనే విషయం తాను కనిపెట్టానని కూడా క్లారిటీ ఇచ్చారు. కావాలని సినిమాపై దుష్ప్రచారం చేసారని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తనకి పవన్ కళ్యాణ్ తో ఎప్పటి నుంచో పరిచయం ఉందని, ఓ బేబీ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ తో మూవీ చేయాలని అనుకున్న కుదరలేదని క్లారిటీ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అంటే తనకి మొదటి నుంచి ఇష్టం ఉందని, అందుకే తనతో ట్రావెల్ చేస్తున్నానని అన్నారు. అలాగే నాదెండ్ల మనోహర్ తో మంచి ఫ్రెండ్ షిప్ ఉందని తెలిపారు. కాని తాను జనసేన పార్టీలో పనిచేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. సినిమాల పరంగా వచ్చే ఏడాది ఏకంగా 10 పాన్ ఇండియా సినిమాలు మా బ్యానర్ నుంచి రాబోతున్నాయని అన్నారు.

రెండు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అవుతున్నామని తెలిపారు. గూఢచారి 2 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని తెలిపారు.

వీలైనంత వేగంగా వంద సినిమాలు కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నానని, ఇప్పటికే 50 చిత్రాలకి దగ్గరగా వస్తున్నామని తెలిపారు. వరుసగా సినిమాలు చేస్తూ ఉండటం వలన ఫైనాన్సియల్ గా ఇబ్బంది ఉండదని, బ్యాలెన్స్ షీట్ కరెక్ట్ గా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.