Begin typing your search above and press return to search.

స్టార్ క్యాస్టింగ్ ను వృధా చేశారుగా!

అంత భారీ క్యాస్టింగ్ ను పెట్టుకుని ఇలాంటి సినిమానా తీసేది అని టెస్ట్ చూసిన ప్ర‌తీ ఒక్క‌రూ పెద‌వి విరుస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 April 2025 1:57 PM IST
స్టార్ క్యాస్టింగ్ ను వృధా చేశారుగా!
X

ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్ లో టెస్ట్ అనే సినిమా రిలీజైన సంగ‌తి తెలిసిందే. మాధ‌వ‌న్, సిద్ధార్థ్, న‌య‌న‌తార‌, మీరా జాస్మిన్ లాంటి భారీ తారాగ‌ణంతో రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు ముందు సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. కానీ ఇప్పుడా సినిమాకు ఆడియ‌న్స్ నుంచి ఆశించిన ఫ‌లితం రావ‌డం లేదు. టెస్ట్ చూసిన ఏ ఒక్క‌రూ సినిమాపై సంతృప్తిగా లేరు.

అంత భారీ క్యాస్టింగ్ ను పెట్టుకుని ఇలాంటి సినిమానా తీసేది అని టెస్ట్ చూసిన ప్ర‌తీ ఒక్క‌రూ పెద‌వి విరుస్తున్నారు. రిలీజ్ కు ముందు ఈ సినిమాకు మేక‌ర్స్ భారీగా ప్ర‌మోష‌న్స్ కూడా చేయ‌లేదు. సినిమా రిలీజ‌య్యాక మౌత్ టాక్ తోనే టెస్ట్ వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంద‌ని మేక‌ర్స్ భావించారు. మేక‌ర్స్ ఊహించిన వండ‌ర్స్ చేయ‌క‌పోగా ఆడియ‌న్స్ ఈ మూవీ చూశాక అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

సినిమాలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌తో పాటూ మ‌రో ఇద్ద‌రు టాలెంటెడ్ యాక్ట‌ర్లు ఉన్నారు. ఎంత మంచి స్టార్ క్యాస్టింగ్ ఉన్న‌ప్ప‌టికీ సినిమాలో కంటెంట్ లేక‌పోతే ఈ రోజుల్లో ఆడియ‌న్స్ సినిమా చూసే ప‌రిస్థితులు లేవు. గ‌తంలో మాధ‌వ‌న్- సిద్ధార్థ్ క‌ల‌యిక‌లో రంగ్ దే బ‌సంతి సినిమా వ‌చ్చింది. ఆ సినిమా సూప‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో పాటూ క‌ల్ట్ స్టేట‌స్ ను కూడా ద‌క్కించుకోవ‌డంతో టెస్ట్ కూడా అలాంటి మ్యాజిక్ ఏదైనా చేస్తుంద‌ని అంద‌రూ ఆశించారు.

కానీ అదేమీ జ‌ర‌గ‌లేదు. న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్ ఎంత బావున్న‌ప్ప‌టికీ మంచి క‌థ‌, క‌థ‌నం లేక‌పోతే ఆడియ‌న్స్ సినిమాను చూడ‌లేరు. దానికి తోడు క‌థ స‌డెన్ గా ఎందుకు ఎండ్ అవుతుందో అర్థం అవ‌దు. ఇలా ఒక‌టి కాదు, టెస్ట్ చూశాక ఒక్కొక్క‌రు ఒక్కో కామెంట్ చేస్తూ సినిమాపై త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

న‌టీన‌టులు ఎంత క‌ష్ట‌ప‌డి సినిమాను పైకి లేపుదామ‌న్నా రైటింగ్ స‌రిగా లేన‌ప్పుడు వాళ్ల క‌ష్టం బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది. సినిమాకు టెస్ట్ అని మంచి పేరే పెట్టారు కాకపోతే ఆ టెస్ట్ సినిమా చూసిన ఆడియ‌న్స్ స‌హ‌నానికి అని నెటిజ‌న్లు సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా టెస్ట్ మూవీ మంచి స్టార్ క్యాస్ట్ ను వేస్ట్ చేసింద‌నేది మాత్రం ఒప్పుకోవాల్సిన వాస్త‌వం.