Begin typing your search above and press return to search.

బాలీవుడ్.. మరో డిస్సపాయింటింగ్ ఫ్రైడే!

బాలీవుడ్ హీరో హీరోయిన్లు షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించిన తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా సినిమా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   10 Feb 2024 5:45 AM GMT
బాలీవుడ్.. మరో డిస్సపాయింటింగ్ ఫ్రైడే!
X

బాలీవుడ్ హీరో హీరోయిన్లు షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించిన తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా సినిమా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. కృతి సనన్ రోబోగా నటించగా.. రోబోకు, మనిషికి మధ్య జరిగే ప్రేమకథగా ఈ మూవీ తెరకెక్కింది. అమిత్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మోస్తరు అంచనాల మధ్య ఫిబ్రవరి 9వ తేదీన రిలీజైంది.

అయితే ఈ సినిమాకు చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ). ఇందులో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ఒక ఇంటిమేట్ సీన్‌ ను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. దీంతో పాటు సినిమాలోని సెకండ్ హాఫ్‌ లోని ఒక సీన్‌ లో దారు అనే పదాన్ని తొలగించి డ్రింక్ అనే పదాన్ని యాడ్ చేయమని చెప్పిందట సీబీఎఫ్‌సీ.

ఇక షాహిద్ కపూర్, కృతి సనన్ ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. వీరిద్దరూ ఎప్పుడూ కలిసి నటించలేదు. తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా కోసం మొదటిసారి వీరిద్దరూ జతకట్టారు. ఫస్ట్ మూవీలోనే వీరిద్దరూ అదిరిపోయే కెమిస్ట్రీని కనబరిచారని టాక్ వినిపించింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ సంపాదించుకోలేకపోయింది. ఈ సినిమాను చూసిన ప్రముఖ ట్రేడ్ సినీ అనలిస్ట్, సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో తెలిపారు.

ఈ సినిమా నిరాశపరిచిందని తరణ్ ఆదర్శ్ చెప్పారు. టూ స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. స్క్రీన్ రైటింగ్ చాలా పేలవంగా ఉందని, అందుకే కాన్సెప్ట్ అర్థం కావడం కాస్త కష్టమని చెప్పారు. సెకండాఫ్ ఫుల్ బోర్ అని అన్నారు. కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా, వావ్ అనిపించేలా లేవని తెలిపారు. హీరోహీరోయిన్ల మధ్య ట్రాక్ బాగానే ఉందని చెప్పారు. దీంతో బాలీవుడ్ కు మరో డిస్సపాయింటింగ్ ఫ్రైడే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమాను దినేశ్ విజన్, జ్యోతి దేశ్‌ పాండే, లక్ష్మణ్ ఉటేకర్ నిర్మించారు. ధర్మేంద్ర, డింపుల్ కపాడియా లాంటి సీనియర్ హీరో, హీరోయిన్లు నటించారు. సుమారు రూ.120 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.160 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఈ రేంజ్ వసూళ్లు రాబడితే గానీ.. ఈ మూవీ హిట్ గానీ.. సూపర్ హిట్ స్టాటస్‌ ను అందుకోలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.