కృతిసనన్ తో 'కుబేర' ఘాటైన లిప్ లాక్!
బాలీవుడ్ లో ధనుష్-కృతిసనన్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ `తేరే ఇష్క్ మే` చిత్రాన్ని తె రకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 July 2025 4:12 PM ISTబాలీవుడ్ లో ధనుష్-కృతిసనన్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ `తేరే ఇష్క్ మే` చిత్రాన్ని తె రకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. `రాంఝానా` తర్వాత మరోసారి ధనుష్ హీరోగా రాయ్ తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇదీ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ యూనిట్ పంచుకున్న వీడియోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
ఇందులో శంకర్ అనే యువకుడి పాత్రలో ధనుష్..ముక్తి అనే అమ్మాయి పాత్రలో కృతిసనన్ నటిస్తున్నారు. ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీగా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగ ప్రకటించారు. ఈనేపథ్యంలోనే సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం లీకైంది. ఇందులో ధనుష్-కృతి సనన్ మధ్య ఘాటైన లిప్ లాక్ సన్నివేశం ఒకటుందిట.
ఇరువురు ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్త పరుచుకునే సమయంలో లిప్ లాక్ సన్నివేశం వస్తుందని విని పిస్తుంది. సాధారణంగా ఆనంద్ ఎల్ రాయ్ చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు పెద్దగా ఉండవు. సీన్ బాగా డిమాండ్ చేస్తే తప్ప పెట్టరు. `తేరే ఇష్క్ మే` కోసం ఆ ఛాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ సన్ని వేశాలకు ధనుష్ కూడా దూరంగా ఉంటాడు. వీలైనంత వరకూ తన సినిమాల్లో అలాంటి సన్నివేశాలు తావు ఇవ్వకుండా చూసు కుంటాడు.
కానీ సీన్ డిమాండ్ చేసిదంటే రాజీపడతాడు. ఆ సమయంలో పూర్తిగా దర్శకుల హీరోగా మారిపోతాడు. ఇటీవల రిలీజ్ అయిన కుబేరతో ధనుష్ భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది.
