Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: స‌మాజంతో న‌ల్ల‌న‌మ్మాయి పోరాటం

ఇలియానా న‌టించిన త‌దుప‌రి చిత్రం `తేరా క్యా హోగా లవ్లీ` ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ట్రైల‌ర్ ఆద్యంతం డార్క్ స్కిన్ టోన్ అమ్మాయి పాట్లు ఎలా ఉంటాయో ఆవిష్క‌రించారు

By:  Tupaki Desk   |   28 Feb 2024 1:36 PM GMT
ట్రైలర్ టాక్: స‌మాజంతో న‌ల్ల‌న‌మ్మాయి పోరాటం
X

టాలీవుడ్‌లో అగ్ర క‌థానాయిక‌గా ఏలిన ఇలియానా ఆ త‌ర్వాత త‌మిళం, హిందీ చిత్ర‌సీమ‌ల్లో న‌టించింది. ఇటీవ‌ల పూర్తిగా హిందీ ప‌రిశ్ర‌మ‌కే అంకిత‌మైంది. అయితే బాలీవుడ్ లోను ఆశించిన కెరీర్ ని అందుకోవ‌డంలో ఇల్లీ విఫ‌ల‌మైంది. ప్ర‌స్తుతానికి నెమ్మ‌దిగా త‌న కెరీర్ బండిని ముందుకు సాగిస్తోంది.

ఇలియానా న‌టించిన త‌దుప‌రి చిత్రం `తేరా క్యా హోగా లవ్లీ` ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ట్రైల‌ర్ ఆద్యంతం డార్క్ స్కిన్ టోన్ అమ్మాయి పాట్లు ఎలా ఉంటాయో ఆవిష్క‌రించారు. ముదురు రంగు చర్మం గల అమ్మాయి వివాహం కోసం వేచి చూస్తుంది. కానీ నేటి స‌మాజంతో ఆ అమ్మాయి చిక్కులేమిట‌న్న‌ది ఫన్, ఎమోష‌న్ క‌ల‌గ‌లిపి ఈ చిత్రంలో చూపించారు. భారతీయ సమాజంలో ప్రబలంగా ఉన్న రెండు సమస్యలపై ఈ చిత్రం రూపొందింది. స్కిన్ టోన్ పక్షపాతం, వరకట్నం వంటి స‌మ‌స్య‌ల్ని వెలుగులోకి తెస్తోంది.

ఇందులో రణదీప్ హుడా పోలీసాఫీస‌ర్ గా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఛామ‌న‌ ఛాయతో ఉన్న అమ్మాయిగా ఇలియానా న‌టించింది. డార్క్ టోన్ తో సామాజిక ఒత్తిళ్లు, పక్షపాతాలను ఎదుర్కొనే యువతి పాత్రను ఇలియానా పోషించింది. రణదీప్ హుడా ఇలియానాకు సహాయం చేసే పోలీసు అధికారి పాత్రలో నటించాడు. `తేరా క్యా హోగా లవ్లీ` అనేది ముఖ్యమైన సామాజిక సమస్యలను పరిష్కరించే లేదా ఆలోచింపజేసే చిత్రం.

బల్వీందర్ సింగ్ జంజువా దర్శకత్వం వహించిన #TeraKyaHogaLovely మహిళా దినోత్సవం 8 మార్చి 2024న థియేటర్లలోకి వస్తోంది. బాలీవుడ్ లో పెద్ద స్థాయికి ఎదగ‌డంలో విఫలమైంది. ఫాటా పోస్టర్ నిఖ్లా హీరో, బర్ఫీ, ది బిగ్ బుల్ త‌ర్వాత కెరీర్ గ్రోత్ లేకుండా పోయింది. మరోవైపు ఇలియానా రిలేషన్ షిప్స్ బోలెడంత చ‌ర్చ‌కు తెర తీసాయి. ఈ బ్యూటీ ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది.