Begin typing your search above and press return to search.

టెంప్టేష‌న్ షో.. నిండా మున‌గ‌డం గ్యారెంటీ

టెంప్టేషన్ ఐలాండ్ భారతీయ వెర్ష‌న్ ప్ర‌తి ఇంట్లోను ఇక‌పై సంద‌డి చేస్తుంది. మొట్టమొదటిసారిగా, జంటల టెంప్టేషన్ ఎలా ఉంటుందో చూడ‌బోతున్నాం.

By:  Tupaki Desk   |   22 Oct 2023 2:45 AM GMT
టెంప్టేష‌న్ షో.. నిండా మున‌గ‌డం గ్యారెంటీ
X

డేటింగ్ రియాలిటీ షోల ట్రెండ్ ఇప్ప‌డు భార‌త‌దేశంలో అగ్గి రాజేయ‌బోతోంది. యూత్ గుండెల్లో కుంప‌టిగా మార‌బోతోంది. ఒంట‌రిదీవిలో స‌ర‌సాలాట‌లు ఫారినర్స్ కి కొత్తేమీ కాదు కానీ మ‌న‌కు కొత్తే. ఇంత‌కుముందు ఆంగ్లంలో ఈ త‌ర‌హా రియాలిటీ షోలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప ఆద‌ర‌ణ పొందాయి. ఇదే కేట‌గిరీకి చెందిన‌ ఒక షో -టెంప్టేషన్ ఐలాండ్. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీ ఇండియా వెర్ష‌న్ భార‌తీయుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా మార‌నుంది. ఇంత‌కుముందే 'టెంప్టేష‌న్ ఐలాండ్ ఇండియా' విడుదల తేదీని జియో సినిమా ప్ర‌క‌టించింది. ఈ షోకి నాగిని ఫేం మౌని రాయ్ హోస్టింగ్ చేయ‌నుంద‌ని ధృవీకరించింది.

టెంప్టేషన్ ఐలాండ్ భారతీయ వెర్ష‌న్ ప్ర‌తి ఇంట్లోను ఇక‌పై సంద‌డి చేస్తుంది. మొట్టమొదటిసారిగా, జంటల టెంప్టేషన్ ఎలా ఉంటుందో చూడ‌బోతున్నాం. ఉష్ణమండల స్వర్గం(ద్వీపం)లో మంత్రముగ్ధం చేసే రొమాన్స్ కి ఇది వేదిక కానుంది. మొత్తం దేశాన్ని ఈ రొమాంటిక్ షో ఊపేస్తుంద‌ని అంచ‌నా. నవంబర్ 3 రాత్రి 8 గంటలకు JioCinemaలో ఈ సిరీస్ ప్రీమియర్ అవుతుంది. కొత్త ప్రోమోలో అన్ని వివరాలను షేర్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. అక్టోబర్ 6న భారతీయ వెర్ష‌న్ గురించి తొలి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఐకానిక్ సిరీస్ ప్రపంచంలోని అతిపెద్ద డేటింగ్ రియాలిటీ షోలలో ఒకటి. న‌వంబ‌ర్ నుంచి ప్ర‌తి ఇంటా ఈ షో సంద‌డి చేస్తుంది.

షో టైటిల్ కి త‌గ్గ‌ట్టే హాట్ గాళ్ మౌని రాయ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు స‌ర్వస‌న్నాహ‌కాల్లో ఉంది. ప్రోమో అన్యదేశ ద్వీపంలో జంట‌ల స‌య్యాట‌ను ఆవిష్క‌రించింది. ఇక‌ జంట‌ల మ‌ధ్య ఒరిజినాలిటీ, నిజాయితీ, న‌ట‌న వంటి వ‌న్నీ బ‌య‌ట‌ప‌డ‌టం ఖాయం. అంతిమంగా 'ప్యార్ కి పరీక్ష' లో కొత్త సంబంధాలను స్వీయ-ఆవిష్కరణ ప్రయాణాన్ని అన్వేషించడానికి పోటీదారులకు మార్గం సుగమం చేస్తుంది. ఈ ఆకర్షణీయమైన రియాలిటీ సిరీస్‌లో జంటలు కొత్త ప్రేమలను అన్వేషిస్తారనేదే పెద్ద ట్విస్ట్. అంతేకాదు వారు ఉద్దేశపూర్వకంగా విడిపోతారు. త‌మ‌లోని లోతైన కోరికలను మ‌రింత‌ లోతుగా పరిశోధించడం ద్వారా పాత బంధాలను తెంచుకుంటారు.. అంటూ ఇప్ప‌టికే అగ్గిరాజేసే క్యాప్ష‌న్ తో ప్ర‌చారం మొద‌లెట్టేశారు.

కొత్త డేటింగ్ రియాలిటీ షో కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే ఇది ర‌సర‌మ్యం కానుంది. జంట‌లు ఉద్ధేశ పూర్వ‌కంగా విడిపోయాక అంద‌మైన సింగిల్స్ వారితో చేర‌తారు. వీరంతా తమ మ‌న‌సులోని భావాలను బ‌య‌ట‌పెడ‌తారు. త‌మ‌కు తాముగా తెలియని టెంప్టేషన్‌లను ఎదుర్కొంటారు. వారి లోతైన కోరికలను పరిశోధిస్తారు. బంధాలు అనుబంధాల‌కు పాత‌రేసారు! అని ఓల్డ్ సినిమా డైలాగ్ చెప్ప‌క‌పోతే ఈ షో చాలా ర‌స‌ర‌మ్యంగా ఉర్రూత‌లూగించ‌డం గ్యారెంటీ. అమ్మాయి అబ్బాయి మ‌ధ్య కొత్త‌ సంబంధాలు మానవ భావోద్వేగాలతో రియాలిటీ సిరీస్ భారతీయ వీక్షకులను ఒక ప్రత్యేకమైన ఉత్కంఠ‌ను రేకెత్తించే వీక్షణ అనుభవాన్ని అందజేస్తుందని భావిస్తున్నారు.