సిద్ధు 'తెలుసు కదా'.. పక్కా ప్లాన్ తోనే..!
అయితే ప్రమోషన్స్ ను ఇప్పటికే మేకర్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ సాంగ్ మల్లిక గంధ చార్ట్ బస్టర్ గా నిలిచింది.
By: Tupaki Desk | 16 Sept 2025 10:23 PM ISTటాలీవుడ్ స్టార్ బాయ్, యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు తెలుసు కదా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ట్రయాంగిల్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ మూవీని ఫేమస్ స్టైలిస్ట్ నీరజ కోన తెరకెక్కిస్తున్నారు. తెలుసు కదా చిత్రంతోనే ఆమె డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీస్ రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు కన్నడ భాషల్లో దీపావళి కానుకగా సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ప్రమోషన్స్ ను ఇప్పటికే మేకర్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ సాంగ్ మల్లిక గంధ చార్ట్ బస్టర్ గా నిలిచింది. మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ పాటే వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో రెండో పాటను కూడా విడుదల చేయనున్నారు. అది కూడా మంచి హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో మేకర్స్ ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. సినిమాపై ఆసక్తి రేపింది. అయితే ఇప్పుడు మేకర్స్ కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. సినిమా షూటింగ్ ను తాజాగా కంప్లీట్ చేశారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అందులో లాస్ట్ షాట్ షూటింగ్ మూమెంట్స్ ఉన్నాయి. డైరెక్టర్ నీరజ కోన.. తెలుసు కదా లాస్ట్ షాట్ అని చెబుతూ కనిపించారు. సిద్ధు తదితరులపై లాస్ట్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. వీడియోలో హీరోయిన్లు, వైవా హర్ష కూడా ఉన్నారు. అయితే షూట్ కంప్లీట్ అయ్యాక అంతా ఆనందం వ్యక్తం చేశారు.
అదే సమయంలో మూవీ టీమ్ అంతా కలిసి స్పెషల్ కేక్ ను కట్ చేసి తినిపించుకున్నారు. హగ్ చేసుకుని బెస్ట్ విషెస్ చెప్పుకున్నారు. అయితే పక్కా ప్లానింగ్ తో మేకర్స్ షూటింగ్ జరిపినట్లు తెలుస్తోంది. ముందే అనుకున్నట్లు చిత్రీకరణ పూర్తి చేశారని సమాచారం. అయితే క్రేజీ ప్రాజెక్ట్ గా రానున్న తెలుసు కదా మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.
