Begin typing your search above and press return to search.

తెలుగు స్టేట్స్.. భారీ వసూళ్లు సాధించిన హిందీ సినిమాలివే

అయితే మల్టీప్లెక్స్ లు వచ్చాక హిందీ సినిమాలు రెగ్యులర్ గా తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 Feb 2024 5:30 AM GMT
తెలుగు స్టేట్స్.. భారీ వసూళ్లు సాధించిన హిందీ సినిమాలివే
X

తెలుగు రాష్ట్రాలలో హిందీ సినిమాలకి పెద్దగా మార్కెట్ ఉండదు. గతంలో ప్రేమ పావురాలు, ప్రేమాలయం లాంటి కొన్ని సినిమాలు తెలుగులో హిట్ అయ్యాయి. అయితే బాలీవుడ్ సినిమాలని ఎందుకనో తెలుగు ఆడియన్స్ పెద్దగా ఆధరించరు. అయితే మల్టీప్లెక్స్ లు వచ్చాక హిందీ సినిమాలు రెగ్యులర్ గా తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ పెరిగింది.

దీంతో బాలీవుడ్ స్టార్స్ తమ సినిమాలని తెలుగు భాషలో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సౌత్ దర్శకులు బాలీవుడ్ కి వెళ్లి సత్తా చాటుతున్నారు. దీంతో హిందీ డబ్బింగ్ సినిమాలకి క్రమంగా తెలుగు రాష్ట్రాలలో ఆదరణ పెరుగుతోంది. హృతిక్ రోషన్ క్రిష్ సిరీస్ ని తెలుగులో కూడా అద్భుతంగా ఆదరించారు. గత ఏడాది పఠాన్, జవాన్, యానిమల్ సినిమాలు హిందీ నుంచి తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టాయి.

ఇక తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో యానిమల్ ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మూవీ 15.45 కోట్ల గ్రాస్ మొదటి రోజు అందుకుంది. రణబీర్ కపూర్, రష్మిక మందన లీడ్ రోల్ లో నటించారు. సందీప్ రెడ్డి దర్శకుడు కావడమే ఈ సినిమాకి మొదటి రోజుభారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

దీని తర్వాత అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన జవాన్ ఏకంగా 9.35 కోట్ల గ్రాస్ మొదటి రోజు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి లాంటి సౌత్ స్టార్స్ ఉండటం. అలాగే దర్శకుడు కూడా సౌత్ లో మంచి ఇమేజ్ ఉన్న అట్లీ కావడమే అని చెప్పాలి. షారుఖ్ ఖాన్ కి కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉండటం కూడా ఒక రీజన్.

రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర 6.70 కోట్ల గ్రాస్ ని మొదటి రోజు అందుకుంది. షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ మొదటి రోజు 6.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ప్యూర్ షారుఖ్ ఖాన్ ఇమేజ్ తో వచ్చిన కలెక్షన్స్ అని చెప్పాలి. తరువాత సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ 5.85 కోట్లు మొదటి రోజు వసూళ్లు చేసింది. ధూమ్ 3 4.70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే యానిమల్ కలెక్షన్స్ రికార్డ్స్ ని మాత్రం ఇప్పట్లో ఏ బాలీవుడ్ మూవీ బ్రేక్ చేయకపోవచ్చు

యానిమల్ – 15.45CR Gross*****

జవాన్ – 9.35CR

బ్రహ్మాస్త్ర – 6.70CR

పఠాన్ – 6.50CR~

టైగర్3 – 5.85CR~

ధూమ్3- 4.70CR