Begin typing your search above and press return to search.

2024 పాన్ ఇండియా.. ఇవి మాత్రం డౌటే..

ఈ చిత్రాలకు మంచి బజ్ ఉన్నప్పటికీ.. తెలుగు వరకు మాత్రమే వీటి హవా ఉంటుందని, పాన్ ఇండియా రేంజ్​లో అంటే పెద్ద సవాల్​​ అనే చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   28 Sep 2023 5:02 AM GMT
2024 పాన్ ఇండియా.. ఇవి మాత్రం డౌటే..
X

ఫిల్మ్​ ఇండస్ట్రీలో.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడం.. ఇలా దాదాపుగా అన్నీ భాషల్లోనూ పదుల సంఖ్యలో చిత్రాలు పాన్ ఇండియాగానే ముస్తాబవుతున్నాయి. మినిమమ్​ బడ్జెట్​తో రూపొందుతోన్న సినిమాలు కూడా.. ఈ పాన్‌ ఇండియా హంగులనే అద్దుకొని ఇండియా వైడ్​గా సత్తా చాటే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే 2021, 2022 టాలీవుడ్​ నుంచి పాన్ ఇండియా చిత్రాలు మెరవగా 2023 మాత్రం ఒక్క సరైన పాన్ ఇండియా చిత్రం కనపడలేదు.


కానీ 2024 మాత్రం అలా లేదు. టాలీవుడ్​ నుంచి దాదాపు డజన్​కు పైగా పాన్ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైపోయాయి. అందులో స్టార్ హీరోల చిత్రాలు చాలా ఉన్నాయి. అయితే ఈ పాన్ ఇండియా చిత్రాలను స్ట్రాంగ్ అండ్ వీక్ అంటూ రెండు క్యాటగిరీలగు విభజిస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. కొన్ని చిత్రాలు బలంగా పాన్ ఇండియా రేంజ్​లో హిట్ కొట్టేవిలా కనిపిస్తుండగా.. మరికొన్ని చిత్రాలు ఇండియా వైడ్​గా హిట్​ అందుకోవాలంటే గట్టి సవాల్​నే ఎదుర్కోవాలని చెబుతున్నారు.


సంక్రాంతికి రానున్న ప్రశాంత్ వర్మ మైథాలాజికల్​ హనుమాన్​ చిత్రంతో పాన్ ఇండియా సినిమాల రిలీజ్​ మొదలు కానున్నాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలతో వచ్చిన రెస్పాన్స్ కారణంగా ఈ చిత్రం హిందీ బెల్ట్​లో మంచి హిట్​ అందుకుంటుందని బలంగా నమ్ముతున్నారు. మరో కార్తికేయ 2 లేదా కాంతార రేంజ్​లో హిట్ అందుకుంటుందని ఆశిస్తున్నారు.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2, యంగ్ టైగర్​ ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్​ ఛేంజర్ 2, ప్రభాస్ కల్కి ఈ చిత్రాలన్నీ వచ్చే ఏడాది కచ్చితంగా ఊహించని రేంజ్​లో భారీ రేంజ్​లో సక్సెస్​ అందుకుంటాయని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రాల్లో ఉన్న కాంబినేషన్స్​, స్టోరీ లైన్స్​, బడ్జెట్స్​.. తదితర అంశాలన్నీ కలిపి ఈ రేంజ్​ ఎక్స్​పెక్టేషన్స్​ క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమాలు ఎలాంటి మాయ చేస్తాయో..

అయితే వెంకటేశ్ సైంధవ్, పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్​, నిఖిల్ స్వయంభు, అడివి శేష్ గూఢాచారి 2, నాగచైతన్య సాయిపల్లవి సినిమా, విజయ్ దేవరకొండ వీడీ 12, ప్రభాస్-మారుతి చిత్రం, పవన్ కల్యాణ్ ఓజీ, హరిహర వీరమల్లు.. పాన్ ఇండియా రేంజ్​లో తెరకెక్కినప్పటికీ.. ఇండియా వైడ్​గా భారీ విజయాన్ని అందుకోవడం కష్టమేనని అంటున్నారు. ఈ చిత్రాలకు మంచి బజ్ ఉన్నప్పటికీ.. తెలుగు వరకు మాత్రమే వీటి హవా ఉంటుందని, పాన్ ఇండియా రేంజ్​లో అంటే పెద్ద సవాల్​​ అనే చెబుతున్నారు.

అయినప్పటికీ వీటిలో నిఖిల్ స్వయంభు, అడివి శేష్ గూఢాచారి 2కు మాత్రం పాన్ ఇండియా రేంజ్​లో భారీ సక్సెస్​ను అందుకునే అవకాశం ఉండొచ్చని అని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ చిత్రాలన్నీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో...