Begin typing your search above and press return to search.

9 ల‌క్ష‌లు రెంట్ క‌డుతున్న తెలుగు హీరోయిన్

కానీ ఆ సినిమా అంతంత మాత్రంగానే ఆడ‌టంతో లేఖ ఆ త‌ర్వాత తెలుగులో పెద్ద‌గా న‌టించ‌లేదు.

By:  Tupaki Desk   |   31 March 2024 1:30 AM GMT
9 ల‌క్ష‌లు రెంట్ క‌డుతున్న తెలుగు హీరోయిన్
X

అల్లు అర్జున్ 'వేదం' సినిమాలో న‌టించింది లేఖా వాషింగ్ట‌న్. గ‌మ్యం క్రిష్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో అనుష్క‌, ధీక్షా సేత్ క‌థానాయికలు కాగా లేఖ వాషింగ్ట‌న్ మంచు మ‌నోజ్ కి పెయిర్ గా న‌టించింది. లేఖ గ్లామ‌ర‌స్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది. కానీ ఆ సినిమా అంతంత మాత్రంగానే ఆడ‌టంతో లేఖ ఆ త‌ర్వాత తెలుగులో పెద్ద‌గా న‌టించ‌లేదు. అటు త‌మిళం, హిందీలో న‌టించేందుకు షిఫ్ట‌యింది.


అదంతా స‌రే కానీ.. ఈ భామ ఇటీవ‌ల నిరంత‌రం బాలీవుడ్ మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ తో జోరుగా ప్రేమాయ‌ణం సాగిస్తోంద‌ని, ఈ ఇద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు పెళ్లి వ‌ర‌కూ చేరుకునేందుకు ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చ‌ని కూడా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇమ్రాన్ ఖాన్ -లేఖా వాషింగ్టన్ జంట గురించి మ‌రో అప్ డేట్ కూడా అందింది. కరణ్ జోహార్ ముంబై అపార్ట్‌మెంట్‌ను నెల‌కు రూ. 9 లక్షల రెంటు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. సినీప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా విశ్రాంతి తీసుకుంటున్న ఇమ్రాన్ ఖాన్ తిరిగి యాక్టివేట్ అవ్వ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత‌డు నిరంత‌రం ఈవెంట్లలో చాలా ప్రదర్శనలు ఇస్తున్నాడు. తరచుగా లేఖా వాషింగ్టన్‌తో కలిసి క‌నిపిస్తున్నాడు. చాలా పుకార్ల తర్వాత ఇమ్రాన్ ఇటీవల లేఖా వాషింగ్టన్‌తో తన సంబంధాన్ని ధృవీకరించాడు. ఇప్పుడు ఈ జంట ముంబైలో కరణ్ జోహార్ అపార్ట్‌మెంట్లో కలిసి జీవిస్తున్నారని ముంబై మీడియా క‌థ‌నాలు ప్ర‌చురిస్తోంది.

కరణ్ జోహార్ కి చెందిన‌ బాంద్రా ఫ్లాట్‌ను రూ. 9 లక్షల అద్దెకు తీసుకున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తులో ఉన్న ఈ కొత్త నివాసం సీ-వ్యూతో అందంగా క‌నిపిస్తుంది. ఇంత‌కుముందు అమీర్ ఖాన్ అద్దెకు తీసుకున్న ఇళ్లలో ఒకదానికి దగ్గరగా ఇది ఉందని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ డేటా ప్రకారం, 20 మార్చి 2024 నాటి ఒప్పందం మూడు సంవత్సరాల కాలానికి సంతకం చేసార‌ని తెలుస్తోంది.

చాలా కాలంగా పుకార్లు:

ఇమ్రాన్ ఖాన్- లేఖా వాషింగ్టన్ డేటింగ్ గురించి పుకార్లు చాలా సంవత్సరాలుగా వైర‌ల్ అవుతున్నాయి. బహుశా అతను భార్య అవంతిక మాలిక్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుండి లేఖాకు స‌న్నిహితుడ‌య్యాడు. ఇమ్రాన్ ఫిబ్రవరి 2019 లో విడాకులు తీసుకున్నాడు. అంతకుముందు చిన్ననాటి ప్రేమికురాలు అవంతిక‌ను 2011లో పెళ్లి చేసుకున్నాడు. 2014లో ఈ జంట ఇమారా మాలిక్ ఖాన్ అనే కుమార్తెకు తల్లిదండ్రులు అయ్యారు. 2019లో విభేదాల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు లేఖా వాషింగ్టన్ కూడా జర్నలిస్ట్ పాబ్లో చటర్జీని వివాహం చేసుకున్నారు.. కానీ వారు కూడా విడిపోయారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇమ్రాన్ ఖాన్ చివరిసారిగా 2015లో కంగనా రనౌత్‌తో కలిసి కట్టి బట్టీలో కనిపించారు. సౌత్ సినీప‌రిశ్ర‌మ‌లో పాపుల‌రైన లేఖా వాషింగ్టన్ శిల్పకళ సహా ఇతర కళాత్మక పనుల్లోను నిమ‌గ్న‌మై ఉంటుంది.