Begin typing your search above and press return to search.

సినిమాటోగ్రాఫ‌ర్‌ని పెళ్లాడిన తెలుగు హీరోయిన్

ఆ త‌ర్వాత‌ జమ్తారా, రఫుచక్కర్ స‌హా ప‌లు సిరీస్ ల‌లో న‌టించింది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 4:47 AM GMT
సినిమాటోగ్రాఫ‌ర్‌ని పెళ్లాడిన తెలుగు హీరోయిన్
X

రామ్ స‌ర‌స‌న కందిరీగ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించిన అక్ష పార్థ‌సాని త‌న‌వైన క్యూట్ లుక్స్ తో ఆక‌ట్ట‌కుంది. రైడ్, బెంగాళ్ టైగ‌ర్, డిక్టేట‌ర్ లాంటి చిత్రాల్లోను ఈ ముంబై బ్యూటీ న‌టించింది. 2008లో `యువ‌త` సినిమాతో టాలీవుడ్‌లో ప్ర‌వేశించిన అక్ష ఇటీవ‌ల సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో వెబ్ సిరీస్ ల‌లోకి ఆరంగేట్రం చేసింది. ఖాట్మండూ క‌నెక్ష‌న్ అనే వెబ్ సిరీస్ తో పాపుల‌రైంది. ఆ త‌ర్వాత‌ జమ్తారా, రఫుచక్కర్ స‌హా ప‌లు సిరీస్ ల‌లో న‌టించింది.


క్యూట్ లుక్స్ హాట్ అప్పియ‌రెన్స్ తో అల‌రించే ఈ బ్యూటీ గురించి అభిమానులకు తాజాగా శుభ‌వార్త అందింది. అక్ష ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కౌశ‌ల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఇటీవ‌ల నిశ్చితార్థం జ‌రిగిన‌ప్ప‌టి ఫోటోలు కూడా ఇంట‌ర్నెట్ లో క‌నిపించాయి. కానీ ఈ పెళ్లి గురించి వైర‌ల్ గా చ‌ర్చ లేదు.

అక్ష పెళ్లి త‌ర్వాత వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలిసింది. గెహ్ర‌యాన్, ముంబై డైరీస్, బాడీస్ ఆఫ్ డిజైర్, బ‌ట‌ర్ ఫ్లైస్ స‌హా ప‌లు చిత్రాల‌కు కౌశ‌ల్ షా సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌ని చేసారు. యువ‌త‌రంలో ప‌నిమంతుడైన సినిమాటోగ్రాఫ‌ర్ ఇప్పుడు క‌థానాయిక‌ను పెళ్లాడ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.