Begin typing your search above and press return to search.

ఆ తెలుగు పాపకు ఇదే మంచి ఛాన్స్

అలాంటి వారిలో చాందిని చౌదరి కూడా ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ ప్రారంభించిన ఈ వైజాగ్ బ్యూటీ కుందనపు బొమ్మ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది.

By:  Tupaki Desk   |   9 Dec 2023 4:33 AM GMT
ఆ తెలుగు పాపకు ఇదే మంచి ఛాన్స్
X

టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావనే విమర్శ చాలా కలం నుంచి ఉంది. నార్త్ ఇండియన్ గర్ల్స్ కి ఇచ్చే ప్రాధాన్యత తెలుగమ్మాయిలకి ఇవ్వరని కామెంట్స్ చేసే తెలుగు హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అడపాదడపా అవకాశాలు అందుకున్న ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఆశించిన స్థాయిలో గుర్తింపుకి నోచుకోరు.

అలాంటి వారిలో చాందిని చౌదరి కూడా ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ ప్రారంభించిన ఈ వైజాగ్ బ్యూటీ కుందనపు బొమ్మ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. తరువాత చాలా సినిమాలు చేసిన ఆశించిన సక్సెస్ రాలేదు. కలర్ ఫోటో సినిమాతో ఓ మంచి సక్సెస్ ని ఈ బ్యూటీ అందుకుంది. ఆ సినిమా హిట్ అయిన చెప్పుకోదగ్గ సినిమాలు అయితే చాందినికి పడలేదు.

కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన సమ్మతమే కొంత పేరు తీసుకొచ్చింది. తరువాత ఇప్పటి వరకు పెద్దగా సినిమాలు లేవు. అయితే డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వెబ్ సిరీస్ లలో రాణించే ప్రయత్నం చేస్తోంది. ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితిలో ఊహించని విధంగా అదిరిపోయే ఆఫర్ ఆమెని వరించింది.

బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో సిద్ధమవుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. మూవీలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే ఓ కీలక పాత్ర కోసం బాబీ చాందిని చౌదరిని తీసుకున్నారని తెలుస్తోంది. ఆమె పాత్ర సినిమాలో చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుందంట

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో కెరియర్ ప్రారంభంలో చాందిని చౌదరి నటించింది. అయితే ఆ సినిమా హిట్ కాలేదు. అలాగే పాత్రకి కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ సారి బాలయ్య సినిమాతో చాందిని ఫేట్ మారుతుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఎంత వరకు అది సాధ్యం అవుతుందనేది చూడాలి.