Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : నామినేషన్స్ ఉల్టా పుల్టా.. ఎలిమినేషన్స్ కూడా..!

బిగ్ బాస్ సీజన్ 7 ని ఎలాగైనా సూపర్ హిట్ చేసేయాలని ప్లానింగ్ లో భాగంగా కొత్త టాస్కులు, నామినేషన్స్ పెడుతున్నాడు బిగ్ బాస్

By:  Tupaki Desk   |   12 Sep 2023 4:05 AM GMT
బిగ్ బాస్ 7 : నామినేషన్స్ ఉల్టా పుల్టా.. ఎలిమినేషన్స్ కూడా..!
X

బిగ్ బాస్ సీజన్ 7 ని ఎలాగైనా సూపర్ హిట్ చేసేయాలని ప్లానింగ్ లో భాగంగా కొత్త టాస్కులు, నామినేషన్స్ పెడుతున్నాడు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లో మండే అంటే ఇట్స్ టైం ఫర్ నామినేషన్స్ అని ఆడియన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. ఎప్పటిలానే రెండో వారం నామినేషన్స్ మొదలు పెట్టారు. అయితే ఈసారి అందరు చూస్తుండగానే బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ పేరు పిలిస్తే వారు బిగ్ బాస్ ఏర్పాటు చేసిన ఒక తొట్టిలో నిలబడితే నామినేట్ చేయాలని అనుకున్న వారు ఒక్కొక్కరుగా వచ్చి వారు రీజన్స్ చెప్పి బజర్ ప్రెస్ చేస్తే అతని మీద కలర్ వాటర్ పడతాయి.

అలా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ జరిగినంత వరకు అయితే తేజ, శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ నామినేట్ అయ్యారు. పవర్ అస్త్రా గెలుచుకున్న సందీప్ ని బిగ్ బాస్ ఒకరిని డైరెక్ట్ గా నామినేషన్స్ లో వేయాలని ఆదేశించగా ప్రిన్స్ యావర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు సందీప్. శివాజిని అమర్ దీప్, ప్రియాంక, షకీలా, దామిని నామినేట్ చేశారు. పల్లవి ప్రశాంత్ ని అమర్ దీప్, గౌతం కృష్ణ, షకీలా, ప్రియాంక, దామిని, తేజ నామినేట్ చేశారు.

రైతు బిడ్డగా బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకోవడం వరకు ఓకే కానీ హౌస్ లో తను చేయాల్సిన పనులు సరిగా చేయట్లేదని హౌజ్ మెట్స్ చెప్పారు. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ల మధ్య వాదన జరిగింది. హౌస్ లో పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ గా ఉన్న రతిక కూడా ఈ నామినేషన్స్ లో బిగ్ బాస్ కు వచ్చి నువ్వేం చేస్తున్నావ్ అంటూ అతని మీద రివర్స్ అయ్యింది. ఆమె నుంచి ఇలాంటి ట్విస్ట్ ఊహించని పల్లవి ప్రశాంత్ షాక్ అయ్యాడని చెప్పొచ్చు. అయితే సోమవారం నామినేషన్స్ పూర్తి కాలేదు. మంగళవారం ఎపిసోడ్ లో కూడా నామినేషన్స్ కొనసాగనున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ఈసారి పెద్ద స్కెచ్ వేశారు బిగ్ బాస్ టీం. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ని హౌస్ నుంచి బయటకు పంపించగా సెకండ్ వీక్ ఎవరు ఊహలకు అందకుండా డబుల్ ఎలిమినేషన్ ఉండేలా చూస్తున్నారట. అంతేకాదు హౌస్ లోకి మరో ఎనిమిది మంది కొత్త కంటెస్టెంట్స్ ని పంపిస్తారని తెలుస్తుంది. మామూలుగా అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒకరిద్దరు మాత్రమే ఉంటారు కానీ ఈసారి ఉల్టా పుల్టా కాబట్టి బిగ్ బాస్ ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపిస్తున్నారని తెలుస్తుంది.

హౌస్ లోకి 14 మంది వెళ్లగా ఫస్ట్ వీక్ ఒకరు ఎలిమినేట్ అయ్యారు. సో ఈ వీక్ ఇద్దరు ఎలిమినేట్ అయితే 11 మంది మిగులుతారు. కొత్తగా 8 మంది వస్తే మళ్లీ టోటల్ 19 మంది కంటెస్టెంట్స్ అవుతారు. సీజన్ 7 ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నారని చెప్పొచ్చు.