Begin typing your search above and press return to search.

నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు… తెలుగు ఆడియన్స్ లెక్కే వేరు

ప్రపంచంలో సినీ ప్రేమికులు ఎక్కువగా ఉండేది ఎక్కడంటే వెంటనే తెలుగు రాష్ట్రాలలో అని చెప్పేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే సక్సెస్ అవుతాయి.

By:  Tupaki Desk   |   6 Aug 2023 4:37 AM GMT
నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు… తెలుగు ఆడియన్స్ లెక్కే వేరు
X

ప్రపంచంలో సినీ ప్రేమికులు ఎక్కువగా ఉండేది ఎక్కడంటే వెంటనే తెలుగు రాష్ట్రాలలో అని చెప్పేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే సక్సెస్ అవుతాయి. కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం కొన్ని సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ అవుతాయి. మాతృభాషలో హిట్ కానీ సినిమాలు కూడా తెలుగులో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

స్ట్రైట్ తెలుగు సినిమాలతో సమానంగా డబ్బిగ్ సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి చాలా మూవీస్ చూపించవచ్చు. కమల్ హాసన్ భారతీయుడు తమిళంలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంతకు మించి తెలుగులో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రజినీకాంత్ చేసిన ముత్తు, అరుణాచలం, భాషా లాంటి సినిమాలు తెలుగులో ప్రభంజనం సృష్టించాయి. అరుణాచలం సినిమా స్ఫూర్తితో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కమల్ హాసన్, రజినీకాంత్ కి కెరియర్ ఆరంభం నుంచి తమిళంతో సమానమైన క్రేజ్ తెలుగులో కూడా ఉంది.

వీరి తర్వాత విక్రమ్, సూర్య కలిసి నటించిన శివపుత్రుడు సినిమా అయితే రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే సూర్య హీరోగా వచ్చిన యువ, ఆరు, యముడు సిరీస్, ఆకాశం నీ హద్దురా, జై భీమ్, 24 లాంటి సినిమాలు తెలుగులో పెద్ద హిట్ అయ్యాయి. కార్తీ యుగానికొక్కడు సినిమా తమిళంలో ఫ్లాప్ అయిన తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఖైదీ, సర్దార్ సినిమాలుగా. తాజాగా సూర్య పాత సినిమా సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ రీ రిలీజ్ లో ఏకంగా 1.20 కోట్ల రూపాయిలు కలెక్ట్ చేసింది అంటే ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ లభించిందో అర్ధం చేసుకోవచ్చు.

అలాగే హిందీలో షారుఖ్ ఖాన్ దిల్ సే మూవీ ప్రేమతో అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అలాగే దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే మూవీ ప్రేమించి పెళ్లాడుతాగా వచ్చి సక్సెస్ అందుకుంది. హృతిక్ రోషన్ క్రిష్ సిరీస్ తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ తర్వాత తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మార్కెట్ స్కోప్ ఉన్న తమిళ్ సినిమాలకి ఉంది. తెలుగు హీరోలతో సమానంగా తమిళ్ స్టార్స్ ని ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు.

కొన్ని సినిమాలు అయితే హీరోలతో సంబంధం లేకుండా సక్సెస్ అందుకుంటున్నాయి. పిశాచి, విజయ్ సేతుపతి మొదటి చిత్రం పిజ్జా తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. సినిమాల విషయంలో తెలుగు ప్రేక్షకులు చాలా పెర్ఫెక్ట్ జడ్జ్ మెంట్ తో ఉంటారు. కంటెంట్ బాగుంది అంటే మాత్రం భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తూ ఉంటారు. కేవలం తమిళ హీరోలు మాత్రమే కాకుండా మలయాళంలో మోహన్ కాల్ నటించిన పులి మురుగన్ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే మలయాళీ థ్రిల్లర్ మూవీస్ ని తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు. అలాగే కన్నడంలో వచ్చిన కాంతారా సినిమాకి తెలుగులో అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. హీరోలని అభిమానించే ప్రేక్షకులు తెలుగులో ఎలా ఉంటారో సినిమాని అభిమానించే ఆడియన్స్ అంతకంటే ఎక్కువగా ఉంటారని చెప్పొచ్చు.