Begin typing your search above and press return to search.

ముంబైలో అత‌డితో దొరికిపోయిన తెలుగు హీరోయిన్

తెలుగులో అంత‌గా హిట్లు లేక స‌త‌మ‌త‌మైన ఓ హీరోయిన్ ముంబైలో త‌న పాపులారిటీని పెంచుకునేందుకు పాకులాడుతోంది

By:  Tupaki Desk   |   8 Feb 2024 9:30 AM GMT
ముంబైలో అత‌డితో దొరికిపోయిన తెలుగు హీరోయిన్
X

తెలుగులో అంత‌గా హిట్లు లేక స‌త‌మ‌త‌మైన ఓ హీరోయిన్ ముంబైలో త‌న పాపులారిటీని పెంచుకునేందుకు పాకులాడుతోంది. ఈ పాకులాటలో భాగంగా ఇటీవ‌ల కొన్ని కొత్త స్నేహాల జోలికి వెళుతోంది. ఇందులో పాపుల‌ర్ ఫ్యాష‌నిస్టా కం పార్టీ గురూగా పాపుల‌రైన యువ సెల‌బ్రిటీ కూడా ఉన్నాడు. ఇప్పుడు స‌ద‌రు తెలుగు హీరోయిన్ అత‌డితో ఎంతో స‌న్నిహితంగా మూవ్ అవుతోంద‌నేది ఒక గుస‌గుస‌.

ఇటీవ‌ల హిందీ బిగ్ బాస్ లో సంద‌డి చేసిన స‌ద‌రు బ్యూటీకి ఆ ఇంటి లోనే అత‌డు ప‌రిచ‌య‌మ‌య్యాడు. అప్ప‌టి నుంచి అత‌డిని తెలుగు బ్యూటీ వ‌దిలిపెట్ట‌డం లేద‌ట‌. తాజాగా ఓ ఈవెంట్లో అత‌డితో క‌లిసి డ్యాన్సులు చేస్తూ బోలెడంత హంగామా సృష్టించింది. అయితే ఈ స్నేహం ఎంత‌వ‌ర‌కూ? ఇది ఇక్క‌డితో ఆగిపోయేదేనా? ఇంకా దూరం వెళుతుందా? అంటూ ఒక‌టే గుస‌గుస వేడెక్కించేస్తోంది.

ప్ర‌స్తుతానికి త‌న‌కు అవ‌కాశాల్లేక‌ కెరీర్ ప‌రంగా ఖాళీ అయిపోయింది. దీంతో ముంబై స‌ర్కిల్స్ లో త‌న‌కు ఒక ప్రో లాగా అత‌డు ప‌నికి వ‌స్తాడ‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఈమ‌ధ్య అత‌డితో పార్టీల్లో ఫోటోలు దిగేందుకు బాలీవుడ్ భామ‌లు వెంపర్లాడటంపైనా బోలెడంత చ‌ర్చ సాగింది. ఇంత‌లోనే లీగ్ లోకి తెలుగు హీరోయిన్ కూడా చేరిపోయింది. అత‌డితో లేటెస్ట్ గా ఓ పార్టీలో డ్యాన్సులాడుతూ కావాల్సినంత ప‌బ్లిసిటీ కొట్టేసింది. హిందీ బిగ్ బాస్ తో కొంత గుర్తింపు వ‌చ్చింది. దానికి తోడు అత‌డితో సాన్నిహిత్యం కూడా ఇప్పుడు మ‌రింత ప్ర‌చారం తెచ్చి పెడుతోంది. అయితే ఇది త‌న‌కు హిందీ చిత్ర‌సీమ‌లో అవ‌కాశాలు తెచ్చి పెడుతుందా? అన్నది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. మునుముందు ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి. ఈ స్నేహం కేవ‌లం ప‌బ్లిసిటీ స్టంట్ కోస‌మేనా? అన్న‌ది కూడా చూడాలి.