Begin typing your search above and press return to search.

రకుల్ పెళ్లిలో తెలుగు స్టార్స్ మిస్సింగ్

తెలుగు అగ్ర హీరోలందరితో కలిసి నటించినప్పటికీ ఆమె తన పెళ్లికి వారిని పిలవలేదని ప్రచారం సాగుతోంది. అయితే ర‌కుల్ ఆహ్వానించినా కానీ ఎవ‌రికీ వీలు ప‌డ‌లేదా? అన్న‌ది స‌స్పెన్స్ గా ఉంది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:47 AM GMT
రకుల్ పెళ్లిలో తెలుగు స్టార్స్ మిస్సింగ్
X

టాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగింది ర‌కుల్ ప్రీత్ సింగ్. అనూహ్యంగా కొన్ని ఫ్లాపుల అనంత‌రం పూర్తిగా బాలీవుడ్ కే ప‌రిమిత‌మైంది. అదే క్ర‌మంలో అక్క‌డ నిర్మాత కం న‌టుడు జాకీ భగ్నానితో డేటింగ్ ని అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఇప్పుడు ఈ జంట‌ 21 ఫిబ్రవరి 2024న వివాహం చేసుకోబోతున్నారు. ఇప్ప‌టికే భారీగా అతిథుల జాబితా కూడా నెట్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. బాలీవుడ్ నుంచి చాలా మంది ప్ర‌ముఖులు ఈ పెళ్లి వేడుక‌కు అటెండ‌వుతున్నారు. వీరంతా తమ ప్రీ వెడ్డింగ్ పార్టీల కోసం గోవాలోని వెడ్డింగ్ లొకేషన్‌కు చేరుకుంటున్నారు. గోవా బీచ్ నుంచి అతిథుల్లో హిందీ ప్ర‌ముఖుల‌ ఫోటోలు వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

అయితే ఈ పెళ్లికి ర‌కుల్ స‌ర‌స‌న న‌టించిన టాలీవుడ్ హీరోలు సందీప్ కిష‌న్, ఎన్టీఆర్, చ‌ర‌ణ్ త‌దిత‌రులు ఎటెండ‌వుతార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఈ వేడుకలకు తెలుగు స్టార్స్ ఎవరూ హాజరుకాలేదు. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లోని తన సహ‌చ‌రుల‌కు, హీరోల‌కు ఆహ్వానాలను అందించలేదా? అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

తెలుగు అగ్ర హీరోలందరితో కలిసి నటించినప్పటికీ ఆమె తన పెళ్లికి వారిని పిలవలేదని ప్రచారం సాగుతోంది. అయితే ర‌కుల్ ఆహ్వానించినా కానీ ఎవ‌రికీ వీలు ప‌డ‌లేదా? అన్న‌ది స‌స్పెన్స్ గా ఉంది.

రకుల్ - జాకీల పెళ్లికి ముఖ్యంగా ర‌కుల్ స్నేహితురాలై ప్రగ్యా జైస్వాల్ మాత్రమే హాజరయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్ సన్నిహితురాలు కావడంతో ఆమెకు ప్రత్యేక ఆహ్వానం అందింద‌ని తెలిసింది. ఈ ఇద్ద‌రూ క‌లిసి ముంబైలో చాలా సార్లు షికార్లు చేయ‌డం తెలిసిన‌దే.