Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకో థియేటర్లలో ఇలా.. కానీ ఇంకాస్త బాగుంటేనే..

దాదాపు రెండు రాష్ట్రాల్లోని ప్రతి స్క్రీన్ లో కూడా అయితే కూలీ మూవీ.. లేకుంటే వార్-2 సినిమా ప్రదర్శితమవుతోంది.

By:  M Prashanth   |   15 Aug 2025 11:45 AM IST
ఎన్నాళ్లకో థియేటర్లలో ఇలా.. కానీ ఇంకాస్త బాగుంటేనే..
X

ఎన్నాళ్లకో థియేటర్లలో ఇలా.. అంటూ అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి. పోటాపోటీగా భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వడంతో థియేటర్స్ వద్ద ఓ రేంజ్ లో సినీ అభిమానులు, ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

కూలీ, వార్-2 సినిమాలు ఆగస్టు 14వ తేదీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ ఓనర్స్ అంతా బిజీగా గడుపుతున్నారు. సిబ్బంది మొన్నటి వరకు ఖాళీగా ఉండగా.. ఇప్పుడు పనుల్లో బిజీ అయిపోయారు. లాంగ్ వీకెండ్.. వరుస సెలవులు రావడంతో సినీ ప్రియులు థియేటర్స్ కు క్యూ కడుతున్నారు.

దాదాపు రెండు రాష్ట్రాల్లోని ప్రతి స్క్రీన్ లో కూడా అయితే కూలీ మూవీ.. లేకుంటే వార్-2 సినిమా ప్రదర్శితమవుతోంది. అయితే విడుదలకు ముందు రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా యమ జోరుగా జరగడం వల్ల మరికొన్ని రోజుల వరకు థియేటర్స్ కళకళలాడుతూ ఉంటాయి. సినీ ప్రియులంతా మూవీలను చూసి ఎంజాయ్ చేస్తారు.

అదే సమయంలో ఇప్పుడు మరో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంక్రాంతి పండుగ తర్వాత ఆ రేంజ్ లో ఇప్పుడు ఆగస్టు 14వ తేదీన రెండు భారీ సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం వల్ల థియేటర్లు కళకళలాడాయనే చెప్పాలి. కానీ మంచి టాక్ తెచ్చుకుని ఉంటే ఇంకా బాగుండేదని కొందరు నెటిజన్లు అంటున్నారు.

నిజానికి.. రెండు సినిమాలకు కూడా మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆ పోస్టులు కనిపిస్తున్నాయి. క్రిటిక్స్ రివ్యూలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఉంటే.. కొన్ని రోజుల పాటు అద్భుతమైన వసూళ్లు వచ్చేవి. బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా వసూళ్ల వర్షం కురిసేదని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

డిస్ట్రిబ్యూటర్లు, బయర్లు పండుగ చేసుకునేవారు. కానీ ఇప్పుడు వార్-2, కూలీ చిత్రాలు మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. కాబట్టి ఇప్పటికి థియేటర్స్ కళకళలాడుతున్నప్పటికీ.. తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. వీక్ డేస్ లో సినిమాలు వసూళ్లు సాధించే బట్టి ఉంటుంది పరిస్థితి. మరి తెలుగు రాష్ట్రాల్లో రెండు సినిమాల పొజిషన్ ఎలాంటి ఉంటుందో తెలియాలంటే వేచి చూడాలి.